రాష్ట్రంలో కొందరు అధికారులు ( Govt Officers ) కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేసారు. చట్టప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా, కార్యకర్తల మాదిరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు వారి సంగతి తప్పకుండా చూస్తామని హెచ్చరించారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుడు తానే రాజు, తానే మంత్రి అన్నట్టు.. నేనే ప్రభుత్వాన్ని నడుపుతున్న అన్నట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆయనకు అధికారులు వంతపాడుతూ ఉన్నారు. మొన్న ఏపీలో ఏం జరిగిందో చూడండి.. ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయ్యారు. చట్టం ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తాం అంటే తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. ఆలిండియా సర్వీసు ఆఫీసర్లు, పోలీసులు, ఆర్డీవోలు, కలెక్టర్లు ఎవరైనా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం, ఒళ్లు దగ్గర పెట్టుకోని పని చేయండి. ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే ఊరుకోం అని హెచ్చరించారు.
Read Also : Hydraa : ప్రభుత్వం కట్టడాలు నిర్మించాల్సిందీపోయి.. కూల్చేయడం ఏంటి..? – కిషన్ రెడ్డి లేఖ