Site icon HashtagU Telugu

KTR Letter TO Rahul : అదానీపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందా..? అంటూ రాహుల్ కు కేటీఆర్ లేఖ

Ktr Letter Rahul

Ktr Letter Rahul

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి లేఖ రాశారు. ఈ లేఖలో అదానీ వ్యవహారం(Adani Issue)పై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే అదానీ వ్యతిరేక పోరాటం చేస్తోందా లేక ప్రజలను మోసం చేస్తోందా అనే విషయంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై అదానీకి మద్దతుగా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నప్పుడు, అదే అదానీ సంస్థలతో తమ పాలిత రాష్ట్రాల్లో ఎలా వ్యాపారాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతల ప్రోత్సహంతో అదానీ సంస్థలు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ఈపీసీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అదానీ వ్యతిరేకత పేరుతో ఉపన్యాసాలు చేస్తుండగా, ఆచరణలో అలాంటి ఏ చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ లేఖతో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరాటం మరింత హోరాహోరీగా మారింది. రాహుల్ గాంధీ దీనిపై ఎలా స్పందిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అదానీ అంశంపై కాంగ్రెస్ పార్టీ తీరును బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం తెలంగాణలో రాజకీయ వేడి పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

అలాగే సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కనే ఉంటే బాగుంటుంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ స్పందించారు. చరిత్ర విలువ తెలియదు.. మహోన్నతులను గౌరవించడం చేతకాదు అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన ఎన్టీఆర్ మీదనా మీ పిల్లికూతలు..? పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా..? మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా..? అని నిల‌దీశారు. కూల్చడం! మార్చడం! ఆనవాళ్లు చెరిపేయడం! ఇదేగా మీకు చేతనైనది!! ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు.. విధ్వంసకారుడి వికృత ఆలోచ‌న‌ల‌కు ప్రతిరూపం! అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మండిప‌డ్డారు.

Read Also : Raja Saab : రాజా సాబ్ నుంచి లీకైన ఫోటో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!