Site icon HashtagU Telugu

KTR Abroad: కేటీఆర్ విదేశీ పర్యటన…పెట్టుబడులే లక్ష్యంగా టూర్..!!

Ktr

Ktr

తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్…ఇవాళ్టి నుంచి పదిరోజులపాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఉదయం పదిగంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా బ్రిటన్ తోపాటు స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు కేటీఆర్. లండన్ లో మూడు రోజుల పాటు పలు సంస్థల అధిపతులు , సీఈవోలకు భేటీ కానున్నారు కేటీఆర్.

ఈనెల 22నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు కేటీఆర్. ఆ సదస్సులో పలు దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో భేటీ కానున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ ప్రసంగిస్తారు. ఈనెల 26న తిరిగి రాష్ట్రానికి తిరిగి వస్తారు. పర్యటనలో కేటీఆర్ వెంట ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం వెళ్లనున్నారు.