KTR-Kavitha Twist : చంద్ర‌బాబు జైలు ఎపిసోడ్ లో రేవంత్ రౌండ‌ప్

KTR-Kavitha Twist :  తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్ర‌త్యామ్నాయ‌మ‌ని క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఫిక్స‌యింది.

  • Written By:
  • Updated On - September 29, 2023 / 04:32 PM IST

KTR-Kavitha Twist :  తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్ర‌త్యామ్నాయ‌మ‌ని క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఫిక్స‌యింది. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ క‌విత మాట‌ల ద్వారా ఆ విష‌యం అర్థ‌మ‌వుతోంది. అందుకే, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ చంద్ర‌బాబును జైలుకు పంపించిన ఎపిసోడ్ ను మ‌ళ్లించారు. ఆయ‌న్ను జైలుకు పంపిన త‌రువాత ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న‌లు పెల్లుబికాయి. అదే త‌ర‌హాలో హైద‌రాబాద్ లోనూ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లకు చంద్ర‌బాబు అభిమానులు దిగారు. కానీ, కేసీఆర్ ప్ర‌భుత్వానికి న‌చ్చ‌లేదు. ఆందోళ‌న‌కారుల‌ను క‌ట్ట‌డీ చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఏపీలోని ఇష్యూను తెలంగాణ‌కు ఎందుకు తీసుకొస్తున్నారంటూ అణ‌చివేసేలా వ్య‌వ‌హ‌రించింది.

ఏపీలోని ఇష్యూను తెలంగాణ‌కు ఎందుకు తీసుకొస్తున్నారంటూ (KTR-Kavitha Twist)

ఏపీ రాజ‌ధాని హైద‌రాబాద్ అంటూ ఇటీవ‌ల మంత్రి బొత్సా కూడా చెప్పారు. ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాదు 2024 వ‌ర‌కు ఉంది. అవ‌స‌ర‌మైతే, దాన్ని పొడిగించ‌డానికి కూడా విభ‌జ‌న చ‌ట్టంలో వెసుల‌బాటు లేక‌పోలేదు. అందుకే, ఏపీ ప్ర‌జ‌ల‌కు అప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ మీద హ‌క్కు ఉంది. పైగా భౌగోళికంగా విడిపోయిన‌ప్ప‌టికీ సోద‌రులు మాదిరిగా కలిసుందామ‌ని సీఎం కేసీఆర్ కూడా ప‌లుమార్లు చెప్పారు. ఉద్య‌మ స‌మ‌యంలో దాన్ని పెద్ద నినాదంగా వినిపించారు. ఇప్పుడు భౌగోళికంగా మాత్ర‌మే కాదు, మాన‌సికంగా కూడా విడిపోవాల‌న్న దుగ్ధ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్య‌ల్లో క‌నిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబును జైలుకు పంప‌డాన్ని ఏపీ వ‌ర‌కు ప‌రిమితం చేయాల‌ని వాళ్లు (KTR-Kavitha Twist) చూడ‌డం గ‌మ‌నార్హం.

క‌ల్వ‌కుంట్ల కుటుంబం చ‌తుర‌త‌

ప్ర‌త్యేక తెలంగాణ సాధించిన. త‌రువాత ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్ ప‌నిచేసింది. ఇటీవ‌ల తెలంగాణ వాదాన్ని కూడా విడిచిపెట్టి బీఆర్ఎస్ గా మార్చేశారు. తెలంగాణ‌యేత‌ర రాష్ట్రాల్లోనూ విస్త‌రించాల‌ని కేసీఆర్ భావించారు. అందుకే, ఏపీలోనూ బీఆర్ఎస్ శాఖ‌ను ఏర్పాటు చేశారు. అక్క‌డ బీఆర్ఎస్ చీఫ్ గా తోట చంద్ర‌శేఖ‌ర్ ను నియ‌మించారు. కానీ, ఆ రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితులు మాకెందుకు అంటూ క‌ల్వ‌కుంట్ల కుటుంబం అంటోంది. అంటే, వాళ్ల‌కు అనుకూలంగా ఎప్పుడు ఏది కావాలంటే అది ప్ర‌జ‌లు వినాల‌న్న‌మాట‌. అందుకే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాళ్ల‌కు చుర‌క‌లు వేశారు. హైద‌రాబాద్ లో ఎవ‌రైనా ఆందోళ‌న‌, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు తెలుపుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు జైలు ఎపిసోడ్ గురించి ఆయ‌న (KTR-Kavitha Twist) కూడా ప్ర‌త్యేకంగా స్పందించ‌లేదు.

Also Read : CM KCR : తెలంగాణ క్యాబినెట్ భేటీ వచ్చే వారానికి వాయిదా.. ఎందుకంటే ?

హైద‌రాబాద్ లో ఎవ‌రైనా ఆందోళ‌న‌లు చేసుకోవ‌డానికి హ‌క్కుందని రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను సానుకూలంగా రాజ‌కీయం చేయ‌డానికి క‌ల్వ‌కుంట్ల కుటుంబం చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టు హైద‌రాబాద్ లో ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఎప్పుడూ లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య ఉండేద‌ని గుర్తు చేస్తున్నారు. చంద్ర‌బాబును జైలుకు పంపిన అంశాన్ని ప‌క్క‌న పెట్టిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ క‌ల్వ‌కుంట్ల కుటుంబం  (KTR-Kavitha Twist)మాట్లాడ‌డం మొద‌లు పెట్టారు.

Also Read : BRS NRIs: ఎమ్మెల్సీ కవిత తో బీఆరెస్ ఎన్నారైల బృందం భేటీ

మాజీ సీఎం చంద్ర‌బాబును జైలుకు పంపిన ఎపిసోడ్ మీద బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయ‌కులు వేర్వేరుగా స్పందిస్తున్నారు. పార్టీ ప‌రంగా తెలంగాణ‌లోని ఎవ‌రూ స్పందించ‌లేదు. కానీ, వ్య‌క్తిగ‌తంగా మాత్రం ఎవ‌రికివారే ఖండిస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో సెటిల‌ర్ల ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉండే నియోజ‌క‌వ‌ర్గాల్లోని లీడ‌ర్లు మాత్రం ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని కీల‌క లీడ‌ర్లుగా ఉన్న రేణుకాచౌద‌రి, వీహెచ్ త‌దిత‌రులు తీవ్రంగా ఖండించారు. అక్క‌డి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కాన్ని త‌ప్పుబట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం క‌ర్ర విర‌గ‌కుండా పాము చావ‌కుండా అన్న‌ట్టు విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు సైటైరిక్ గా స్పందించ‌డం వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు. ఇక బీ ఆర్ ఎస్ పార్టీలోని ప‌లువురు ఖండించారు. బీజేపీలో భిన్నంగా స్పందించారు. చివ‌ర‌కు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్పందించిన వ్యాఖ్య‌ల‌పై మాత్రం సీరియ‌స్ గా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ క‌విత రియాక్ట్ కావ‌డం విచిత్రం.