Site icon HashtagU Telugu

KTR vs Kavitha : కేటీఆర్ – కవిత డిజిటల్ వార్‌

Kcr, Ktr, Kavitha, Trs

Kcr, Ktr, Kavitha, Trs

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ (Kavitha Letter) పెద్ద చర్చకు దారితీసింది. పార్టీ వ్యవస్థపై ఆమె వ్యక్తపరిచిన అసంతృప్తి, కొత్త పార్టీ స్థాపనపై ఊహాగానాలు పార్టీకి తీవ్ర దెబ్బగా మారుతున్నాయి. గులాబీ క్యాడర్ అంతటా ఈ లేఖపై చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్, బీజేపీ నేతలు దీనిని ఆసరాగా తీసుకొని కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

సోషల్ మీడియాలో టీం కవిత వర్సెస్ టీం కేటీఆర్

కవిత లేఖ బయటపడ్డ తర్వాత బీఆర్ఎస్‌(BRS)లో స్పష్టంగా రెండు డిజిటల్ వర్గాలు ఏర్పడ్డాయి. ఒకవైపు టీం కవిత “పార్టీలో హక్కులు లేవా?” అంటూ ప్రశ్నిస్తుంటే, మరోవైపు టీం కేటీఆర్ “కోవర్టులు ఎవరు?” అంటూ కౌంటర్ ఇస్తోంది. సోషల్ మీడియా వేదికగా #WeStandWithKavitha, #WhoAreTheGhosts వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. పార్టీ అంతర్గతంగా ఎవరు దెయ్యాలు? ఎవరు కోవర్టులు? అనే చర్చ తారాస్థాయికి చేరింది.

కేసీఆర్ మౌనం

ఈ వివాదంపై ఇప్పటి వరకు పార్టీ అధినేత కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. కవిత, కేటీఆర్ వర్గాల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతుండడం తో పార్టీ కార్యకర్తల్లో కేసీఆర్ ఫ్యామిలీ లో ఏంజరగబోతుందో అనే టెన్షన్ మొదలైంది. మరోపక్క జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో భవిష్యత్తు మార్గం ఎలా ఉండబోతుందనేదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.