ఇటీవల మన జూబ్లీ హిల్స్‌లో కేటీఆర్ గారు పర్యటిస్తూ, పార్టీ కార్యకర్తలతో కలిసి మాగంటి సునీత గారికి సానుభూతి నాటకం ఆడుతున్నారు. ఆమె భర్త మాగంటి గోపీనాథ్ గారి మరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
అయ్యో, ఇది ఏంటి? ఏదైనా బీద కుటుంబమా అది? తినడానికి దొరక్క ఇబ్బంది పడుతున్నారా? వరదల్లో ఇల్లు కోల్పోయారా? కాదు కదా! గోపీనాథ్ గారు వందల కోట్లు సంపాదించిన వ్యక్తి. కేటీఆర్ గారి బెనామీగా వ్యవహరించారని జూబ్లీ హిల్స్‌లో ఎవరికీ కొత్త విషయం కాదు.
మొత్తం నియోజకవర్గానికి తెలుసు — ఆయన ఎన్నో తప్పులు చేశారు, సినిమావాళ్లను బెదిరించారు, బ్లాక్‌మెయిల్ చేశారు, డ్రగ్స్ రాజకీయాలకు సింబల్‌గా మారారు.
కేటీఆర్ గారూ, సునీత గారు మీకే చెబుతున్నారు — “దయచేసి నన్ను రాజకీయాల నుంచి దూరంగా ఉంచండి, నాకు వీలు కావడం లేదు” అని. అయినా మీరు బలవంతంగా ఆమెను బస్తీల్లో, కాలనీల్లో తిప్పి ప్రచారం చేయిస్తున్నారు. ఆమె చాలా సతమతమవుతున్నారు.
మీరు నిజంగా మాగంటి కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే.. రాజ్యసభ సీటు ఇవ్వండి, లేదా కనీసం ఎంఎల్సీ స్థానం ఇవ్వండి. కానీ ప్రజల సానుభూతి పేరుతో నాటకాలు ఆడకండి.
ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకున్నారు.
కేటీఆర్ గారూ, జూబ్లీ హిల్స్ ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని బాగా తెలుసుకున్నారు. ఇక మోసపోవడం లేదు.
ఈసారి జూబ్లీ హిల్స్ నుంచి నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్‌తో హైదరాబాద్‌కీ, జూబ్లీ హిల్స్‌కీ అభివృద్ధి నిశ్చితం!
జై హింద్! జై తెలంగాణ!