Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు. ఈ ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిందని, అందుకే కాంగ్రెస్‌ సందర్శించాల్సిన అవసరం లేదని కేటీఆర్ చేసిన కామెంట్స్ పై నిరంజన్ దుయ్యబట్టారు.

మేడిగడ్డ విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నాణ్యత లేకుండా సరైన డిజైన్ లేకుండా లోపభూయిష్టంగా నిర్మించారన్న విషయం వారికి ముందే తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పుడు అది చూసే ముఖం లేదు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని , అది ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలియదని చెప్పిన కేటీఆర్.. అప్పుడు స్వయంగా వచ్చి దాని గొప్పతనాన్ని అందరికీ ఎందుకు వివరించలేదని, ప్రజలకు క్లియర్ గా చెప్పడానికి కేటీఆర్ ఎందుకు సంకోచిస్తున్నాడని నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక్కటే కుంగిపోయిందని చెబుతున్న కేటీఆర్ .. ఆ కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అని అన్నారు. గతేడాది అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు జరిగిన ఘటనను పరిశీలించేందుకు వచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపుణులు .. నవంబర్‌ 1న రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ, రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్‌ విభాగం ఇచ్చిన నివేదికలోనూ చాలా తప్పులున్నాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మధ్య కేటీఆర్ కళ్లులేని కబోడిలా మాట్లాడటం విడ్డూరమన్నారు నిరంజన్. .

ఐఏఎస్ అధికారులు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. అతను చేసిన తప్పులకు శిక్షకు కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్.

Also Read: Black Tea: బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?