Site icon HashtagU Telugu

KTR : మారని బీఆర్ఎస్‌ తీరు.. జగన్‌ జపం చేస్తున్న కేటీఆర్‌..!

Ktr, Jagan Mohan Reddy

Ktr, Jagan Mohan Reddy

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల అటు తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌కు, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం నేర్పారు. ప్రజాస్వామ్యంలో నియంత పాలనకు చోటు లేదంటూ వారి సమాధానాన్ని నిక్కచ్చిగా చెప్పారు. అయితే.. బీఆర్‌ఎస్‌, వైసీపీ స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓడిపోయినా ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదని చెప్పుకుంటూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. నిన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవలి ఏపీ ఎన్నికల ఫలితాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఏపీ ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. పేదలకు ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్‌ నష్టపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ తర్వాత కూడా జగన్ కు 40 శాతం ఓట్ షేర్ రావడం విశేషం. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవి. నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి లాంటి వారు కూడా ఓడిపోయారు’’ అని కేటీఆర్ అన్నారు. జగన్, కేసీఆర్ సన్నిహిత మిత్రులన్న విషయం బహిరంగ రహస్యం. కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ పేరుతో 2019 ఎన్నికల్లో జగన్ కోసం కేసీఆర్ పని చేయడం చూశాం. ఎన్నికల తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ని గెలిపించారని కేసీఆర్, కేటీఆర్ చెప్పడం చూశాం. ఫలితాల అనంతరం జగన్‌కు జరిగిన అవమానాన్ని కూడా పంచుకున్నారు.

ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే… హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించడంతో బీఆర్‌ఎస్ కేడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణకు వస్తారని ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా రాజకీయం చేయడం మనం చూశాం. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు రావడాన్ని క్యాడర్‌ తట్టుకోలేక పోతున్నా, తెలంగాణ రాజకీయాల గురించి ఆయనకు గానీ, ఆయన పార్టీకి గానీ సంబంధం లేదంటూ వ్యాఖ్యలు చేసే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉన్నారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నుంచి కూడా కేటీఆర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “తెలంగాణలో ఎన్నికలు జరిగి ఆరు నెలలకు పైగా గడిచినా, ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో కేసీఆర్, కేటీఆర్‌లకు తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఎందుకు ఓడిపోయారో అర్థం కాక ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని విమర్శిస్తున్నారు.

Read Also : Free Sand : ఉచిత ఇసుక సూపర్ సిక్స్ కంటే ఎక్కువ