Site icon HashtagU Telugu

KTR : పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం

Ktr Fire On Police

Ktr Fire On Police

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఏసీబీ విచారణ ముగిసిన (ACB investigation is over) అనంతరం జర్నలిస్టులతో మాట్లాడే ప్రయత్నంలో పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వద్దే మాట్లాడుతానన్న కేటీఆర్‌ను పోలీసులు మీడియా పాయింట్‌కి వెళ్లమని సూచించారు. కేటీఆర్ కారు నుంచే మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. రోడ్డుపై వద్దని, మీడియా పాయింట్లో మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీడియా పాయింట్ ఎక్కడుంది? మీడియాపై ఎందుకు దాడి చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏముంది?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆరోపణలపై కేటీఆర్‌ను ఏసీబీ దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించింది. ఈ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కేటీఆర్ తన లాయర్ రామచంద్రరావుతో కలిసి విచారణకు హాజరయ్యారు. అధికారులు సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్ర‌శ్న‌ల‌ను న‌ల‌భై ర‌కాలుగా అడిగార‌ని, కొత్త‌గా అడిగిందేమీ లేద‌ని , వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాదానాలు చెప్పినట్లు పేర్కొన్నారు.

Read Also : Mohammed Shami: మ‌రోసారి బౌలింగ్‌లో రెచ్చిపోయిన టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ ష‌మీ