Site icon HashtagU Telugu

KTR London: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి…ఆరైవల్ కంపెనీని కోరిన మంత్రి కేటీఆర్..!!

Ktr Uk

Ktr Uk

విదేశీటూర్ లో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీలతో భేటీ అవుతున్నారు కేటీఆర్. ఇందులో భాగంగానే అరైవల్ యూకే ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోపెట్టుబడులు పెట్టడమే కాదు…కంపెనీకి చెందిన విద్యుత్ బస్సులు, వ్యాన్ లు , అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రవేశపెట్టాలని వారిని కోరారు. యూకే పర్యటనలో భాగంగా శనివారం బాన్ బెరీలో అరైవల్ యూకే కంపెనీ ప్రతినిధులు కేటీఆర్ బ్రుందం భేటీ అయ్యింది.

కాగా హైదరాబాద్ లో అల్లాక్స్ కంపెనీతో ఇప్పటికే అరైవల్ యూకే కలిసి పనిచేస్తుంది. అల్లాక్న్ రీసోర్సెస్ ప్రతినిధులు కూడా ఈ భేటీలో మంత్రి కేటీఆర్ వెంట ఉన్నారు. హైదరాబాద్ మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం కంపెనీ బస్సులు ప్రవేశపెట్టాల్సిందిగా కేటీఆర్ ఈ సందర్భంగా అరైవల్ యూకే ప్రతినిథులను కోరారు. ఈవీ రంగంలో ఇప్పటికే తెలంగాణ ముందుందని అరైవల్ యూకే కూడా తమతో చేతులు కలిపితే…ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరింత వేగంగా ముందుకెళ్తామని కేటీఆర్ పేర్కొన్నారు.