KTR: తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పిన బాలుడు….బుడ్డోడి గురించి కేటీఆర్ ఆరా..!!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు గుక్కతిప్పుకోకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రను చెప్పేశాడు.

  • Written By:
  • Updated On - June 2, 2022 / 11:43 PM IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు గుక్కతిప్పుకోకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రను చెప్పేశాడు. తన పేరు రాజా ప్రజ్వల్. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి జరిగిన పరిణామాలను వివరించాడు. ఈ వీడియో ట్విట్టర్ వేదికగా పోస్టు అయ్యింది. ఆ వీడియోలోని బాలుడు ఎవరంటూ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.

అందరికీ నమస్కారం…అంటూ ప్రారంభించిన రాజా ప్రజ్వల్…ఎందరో చేసిన పోరాటం…మరికొందరి బలిదానం ఫలితమే…మన తెలంగాణ రాష్ట్రం. జూన్ 2, 2014 తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారమైన రోజు ఇది . 58ఏళ్ల వివక్షకు తెరపడినరోజు. చరిత్రల సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు..మన తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు…అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తం 1 నిమిషం 17 సెకన్ల పాటు మాట్లాడిన ఆ బాలుడు…టీఆరెస్ ప్రస్తానం, కేసీఆర్ ఉద్యమ పోరాటం, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైనం వంటి అంశాలను నాన్ స్టాప్ గా చెప్పేశాడు.