KTR Demand: సిరిసిల్లలో చేనేత కార్మికుడుది ప్రభుత్వ హత్యే: కేటీఆర్

సిరిసిల్ల చేనేత కార్మికుడు యాదగిరి మృతిపై స్పందించిన కేటీఆర్.. పల్లె యాదగారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

KTR Demand: ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్లలో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బీవై నగర్‌కు చెందిన పల్లె యాదగిరి ఉపాధి లేక మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విధానాల వల్లనే చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

సిరిసిల్ల చేనేత కార్మికుడు యాదగిరి మృతిపై స్పందించిన కేటీఆర్.. పల్లె యాదగారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేనేత రంగానికి అందించిన ఆదరణ సగంలోనే ఆగిపోయిందని విమర్శించారు. ఇది చేనేత రంగానికి మరణ మృదంగం మోగిస్తున్నదని ఆరోపించారు. కాగా మృతుడు యాదగిరి కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.25 లక్షలు చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read: TVS XL 100 Sales: జూన్ నెల‌లో అద‌ర‌గొట్టిన ఎక్సెఎల్ 100.. ఎన్ని అమ్మ‌కాలు జ‌రిగాయంటే..?