KTR Fires on Rahul, Revanth: రాహుల్, రేవంత్ పై కేటీఆర్ ఫైర్!

టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్...తెలంగాణ మంత్రి కేటీఆర్...కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

  • Written By:
  • Updated On - May 7, 2022 / 11:24 PM IST

టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్…తెలంగాణ మంత్రి కేటీఆర్…కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అంటూ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభ…తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి ఉసిగొల్పినట్లయింది. అధికార టీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. వరంగల్లో నిర్వహించి రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు…అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్…స్పందించారు. కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అంటూ విమర్శించారు.

కేటీఆర్ శనివారం మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అంటూ..రూ. 50లక్షలు చేతులు మారుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు వరంగల్ లో జరిగిన సభలో రేవంత్ రెడ్డి…సీఎం కేసీఆర్ ను విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎంకు బదులు తెలంగాణలో ఒకరాజు ఉండేవారని…టీఆరెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ…తెలంగాణలో ముఖ్యమంత్రి లేడని..రాజు ఉన్నాడని ఎలా చెప్పారన్నది ఆసక్తికరంగా ఉందని అన్నారు. రాజు ఎవరు….తెలంగాణలో రాజు ఉంటే….మీ పీసీసీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు స్వేచ్చగా తిరగడానికి అనుమతిస్తారా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు కేటీఆర్.

ఇక రాహుల్ గాంధీపై తనదైన శైలిలో మండిపడ్డారు కేటీఆర్. ఒకే కుటుంబం చేతిలో అధికారం ఉందని రాహుల్ చేసిన ఆరోపణలపై ఘాటుగా విమర్శించారు. మోతీలాల్ నెహ్రు నుంచి మీ వరకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి మీ కుటుంబం అధికారంలో ఉంది. ఇక్కడ మీరు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. రైతు పక్షాన నిలిచే పార్టీ అని చెప్పుకుంటున్నా..పంజాబ్ లో కాంగ్రెస్ ఎందుకు బలహీనపడిందని ఎదురు ప్రశ్న వేశారు.

ఇక రాహుల్ గాంధీ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఏ పదవిలో వచ్చి తెలంగాణకు డిక్లరేషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాహుల్ మమ్మీ అధ్యక్షురాలు…ఆయన డమ్మీ అని వ్యంగ్యంగా మాట్లాడారు. రాహుల్ ఎఫ్పుడు ఇండియాలో ఉంటారో…తెలియదన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్ చదివారని…ఆయన అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. రాహుల్ చెప్పిన మాటలు నమ్మడానికి.. ఇది టెన్ జన్‌పథ్ కాదన్నారు. ఇది చైతన్యానికి ప్రతీక అయినా తెలంగాణ అన్నారు. కాంగ్రెస్‌ గురించి తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసనని కేటీఆర్ అన్నారు.