KTR : ‘ప్రజా దర్బార్’ పొమ్మంది.. ‘తెలంగాణ భవన్’ రమ్మంది.. ఇల్లందు అన్నపూర్ణకు కేటీఆర్ సాయం

KTR : ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్‌కు చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు వచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Ktr

Ktr

KTR : ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్‌కు చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్ సర్కారు నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో తన సమస్యలపై ఏకంగా నాలుగు సార్లు దరఖాస్తులను సమర్పించారు. తన ఆర్థిక సమస్యలను, పిల్లలను చదివించేందుకు పడుతున్న ఇబ్బందులను, దుర్భర జీవితాన్ని వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. అసెంబ్లీ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రోజంతా ఎదురుచూసినా.. సీఎంను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

We’re now on WhatsApp. Click to Join.

విసిగి వేసారిన అన్నపూర్ణ  చివరగా కేసీఆర్, కేటీఆర్‌ను(KTR) కలిసేందుకు తెలంగాణ భవన్‌కు వెళ్లారు. ఆమెను కలిసిన కేటీఆర్‌.. బాధలు విని తన వ్యక్తిగత స్థాయిలో లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. అన్నపూర్ణ  కూతురు నర్సింగ్ చదువు కోసం ఈ డబ్బును కేటీఆర్ అందజేశారు. బంజారాహిల్స్ లో ఉన్న తన ఇంటికి పిలుచుకొని ఈ చెక్కు అందించారు. తన కూతురు చదువు కోసం సహాయం చేసిన కేటీఆర్‌కు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ప్రజల కష్ట సుఖాలు వింటాం. అండగా నిలబడతాం అంటూ ప్రజాదర్బార్ కార్యక్రమం  పేరిట కాంగ్రెస్ సర్కారు ఆర్భాటం చేసింది. టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇచ్చింది. అదంతా ఒట్టి ప్రచారమే. నాకు న్యాయం జరగలేదు’’ అని అన్నపూర్ణ  ఆవేదన వ్యక్తం చేశారు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ప్రజాదర్బార్‌లో న్యాయం పొందలేకపోయానని చెప్పారు. కేటీఆర్ మానవతా కోణంలో తనకు సాయం చేశారని తెలిపారు.

Also Read: Beauty Tips: ముఖం నల్లగా ఉందని బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాతో తెల్లగా అవ్వడం ఖాయం?

  Last Updated: 24 Dec 2023, 06:33 PM IST