Telangana: రేవంత్ కు ఇచ్చి పడేస్తున్న బావాబామ్మర్దులు

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కేటీఆర్, హరీష్ దూకుడు పెంచారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేస్తుండగా, హామీలు అమలు కావని హరీష్ అంటున్నారు. ప్రతిపక్ష పాత్రలో ఈ ఇద్దరు అధికార పార్టీపై ధాటిగా పోరాడుతున్నారు.

Telangana: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కేటీఆర్, హరీష్ దూకుడు పెంచారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేస్తుండగా, హామీలు అమలు కావని హరీష్ అంటున్నారు. ప్రతిపక్ష పాత్రలో ఈ ఇద్దరు అధికార పార్టీపై ధాటిగా పోరాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజలని గాలికి వదిలేసిన మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీసే అధికారం, హక్కు లేదని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగుతున్న పరిస్థితి. ప్రస్తుతం కేటీఆర్, హరీష్ ఒకే నినాదంతో కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫి అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్నారు. ఇది వరకే కేటీఆర్ పంట రుణమాఫీపై సీఎం రేవంత్ ని టార్గెట్ చేయగా, తాజాగా హరీష్ రంగంలోకి దిగాడు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీపై బావాబామ్మర్దులు యుద్ధం ప్రకటించినట్లుగా ప్రొజెక్ట్ అవుతున్నారు.

గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామీని నెరవేర్చాలని కోరుతూ సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత టీ హరీశ్ రావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఒక్క రైతు రుణం కూడా మాఫీ కాలేదన్నారు.

We’re now on WhatsAppClick to Join.

రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు జారీ చేయడంతో బ్యాంకుల నుంచి రైతులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఎత్తిచూపారు. గతంలో వరంగల్ మరియు మెదక్ జిల్లాల్లోని వందలాది మంది రైతులు తమ రుణాలపై వడ్డీలు పేరుకుపోవడంతో వారి ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపడంతో బాధలు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రెండుసార్లు రుణమాఫీ చేయడంపై హరీశ్‌రావు ఉద్ఘాటించారు, ఎంఎస్‌పి ధరపై క్వింటాల్‌కు రూ.500 బోనస్, రూ.15,000 రైతు భరోసా, సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా సహా రైతు వర్గానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని హరీశ్‌రావు కోరారు.

Also Read: Mehbooba Mufti : ఇండియా కూటమికి షాక్.. కశ్మీర్‌లో ఒంటరిగా బరిలోకి పీడీపీ!