Site icon HashtagU Telugu

Kavitha Arrest : కవిత అరెస్ట్ తో సంబరాలు చేసుకుంటున్న కేటీఆర్..హరీష్ రావు

88

88

అతి త్వరలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబదించిన షెడ్యూల్ విడుదలైంది. మే 13 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బిజెపి (BJP) కక్షపూర్తింగానే సుప్రీం కోర్ట్ లో ఈ కేసుకు సంబంధించి విచారణ జారుతున్నప్పటికీ కవితను అరెస్ట్ చేసారని బిఆర్ఎస్ ఆరోపిస్తుంటే..బిజెపి – బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే కవితను అరెస్ట్ చేసారని..సానుభూతి ఓట్ల కోసమే ఇలా చేసారని కాంగ్రెస్ (Congress) ఆరోపిస్తూ వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తుండగా..పక్కనే ఉన్న హరీష్ రావు , కేటీఆర్ లు నవ్వుకుంటున్నట్లు కనిపించారు. దీనిని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘కవిత అరెస్ట్‌ సమయంలో నవ్వుకుంటున్న కేటీఆర్, హరీశ్‌ బీఆర్ఎస్, బీజేపీ డ్రామాకు నిదర్శనం’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా నిజమే కావొచ్చు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం కవిత కు రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో..ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత కీలక సూత్రధారుల్లో ఒకరు. మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటుచేసి కుట్ర చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కుమ్మక్కై రూ.100 కోట్ల మేర ముడుపులను సమర్పించారు. ఆ మేరకు ప్రతిఫలం పొందేలా ఢిల్లీ మద్యం పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని ఉంది. ఈరోజు ఉదయం హరీష్ రావు , కేటీఆర్ తదితరులు కవితను కలుసుకునేందుకు ఢిల్లీ కి వెళ్లారు. ఈరోజు సాయంత్రం వీరు కవిత తో మాట్లాడనున్నారు.

Read Also : T Congress : కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్..