Site icon HashtagU Telugu

KTR : చలో ఢిల్లీ కాదు.. చలో పల్లె చేపట్టాలి.. సీఎం రేవంత్ కు కేటీఆర్ స‌వాల్

KTR open letter to Revanth Reddy Govt

సీఎం రేవంత్ రెడ్డి ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా రుణమాఫీ (Runamafi) ఫై కాంగ్రెస్ , బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. చెప్పినట్లే ఆగస్టు 15 లోపు మూడు విడతల్లో 2 లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెపుతుంటే..పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా 41 వేల కోట్లకు కేవలం 17 వేల కోట్లే రుణమాఫీ చేసి..గొప్పలు చెప్పుకుంటుందని కాంగ్రెస్ ఫై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి సీఎం రేవంత్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా..? అని కేటీఆర్
ట్విట్టర్ వేదికగా ప్ర‌శ్నించారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో.. ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..? రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా..? అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారు.. గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారు.. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి..? అని కేటీఆర్ విమ‌ర్శించారు. అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే..రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు..?? అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప…అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా..?? అని ప్ర‌శ్నించారు.

రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా?? 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. “గుండుసున్నా”. ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో.. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Read Also : Modi Meets Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని మోదీ

Exit mobile version