Site icon HashtagU Telugu

KTR: ఈవార్త వింటే కేసీఆర్ ఫుల్ ఖుషీ..మరో 20ఏళ్లలో కేటీఆరే ప్రధాని అట..!!

KTR Davos

KTR Davos

విదేశీ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్నా యకత్వంలోని టీం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్…పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు ఉన్న విజన్ను కొనియాడుతూ…ఏంజెల ఇన్వెస్టర్ ఆశా జడేజా మోత్వాని ట్వీట్టర్ వేదికగా ప్రశంసించారు. రాబోయే 20 ఏళ్లలో ఈ దేశానికి కేటీఆర్ ప్రధాని అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్నారు.

ఏమని ట్వీట్ చేశారంటే…20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారత్ కు ప్రధాని అయినా అశ్చర్యపోనవసరంలేదు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావవ్యక్తీకరణ ఉన్న ఇలాంటి నాయకుడ్ని నేను నా జీవితంలో ఇప్పటివరకు చూడలేదు. దావోస్ లో తెలంగాణ టీం దూసుకుపోతోంది. చూస్తుంటే…కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకెళ్లే విధంగా ఉన్నారు. నాకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు వచ్చాయి. అంటూ ఆశా జడేజా ట్వీట్ చేశారు. అంతేకాదు ఆమె ట్వీట్ కు కేటీఆర్ తో దిగిన ఫొటోను కూడా జత చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Exit mobile version