Hyderabad: 5 మూసీ వంతెనల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముందడుగేస్తుంది. మహా నగరంలో రోజురోజుకి జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మూసీ, ఈసీ నదులపై ఉన్న బ్రిడ్జిలపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరుగుతుంది.

Hyderabad: హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముందడుగేస్తుంది. మహా నగరంలో రోజురోజుకి జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మూసీ, ఈసీ నదులపై ఉన్న బ్రిడ్జిలపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అటువైపుగా వెళ్లే నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .దీంతో ఒకేసారి 5 వంతెనలను నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ సూచనల మేరకు భిన్నంగా, నగర చారిత్రాత్మక నేపథ్యాన్ని ప్రాధాన్యతనిస్తూ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.168 కోట్లు మంజూరు చేసింది.

మూసీ నదిపై నిర్మించనున్న 5 వంతెనలకు తెలంగాణ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి కేటీఆర్ ఈ రోజు సోమవారం ఉప్పల్‌ భగాయత్‌లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.168 కోట్ల రూపాయలతో అనుమతులు లభించాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసిపై నాలుగు వరుసల వంతెన నిర్మించనున్నారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. ఈ బృహత్తర పనులను 15 నెలల గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మూసీ నదిపై నిర్మించనున్న 5 వంతెనలు:

1. ఈసా నదిపై బుద్వేల్ ఐటీ పార్క్ వద్ద మొదటి వంతెన

2. ఈసా నదిపై బుద్వేల్ ఐటీ పార్క్ వద్ద రెండో వంతెన

3. మూసీ నదిపై మంచిరేవుల వద్ద మూడో వంతెన

4. మూసీ నదిపై HMDA లేఅవుట్ ఉప్పల్ భగాయత్ వద్ద నాల్గవ వంతెన

5. మూసీ నదిపై ప్రతాప్సినారం వద్ద ఐదవ వంతెన

Also Read: Telangana : తెలంగాణలో బీజేపీకి షాక్‌.. బీఆర్ఎస్‌లో చేరిన తొమ్మిది మంది నిజామాబాద్ నేత‌లు