KTR: మరోసారి ఆటోలో ప్రయాణించిన మాజీ మంత్రి కేటీఆర్

  KTR: బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్(ktr)మరోసారి ఆటోలో ప్రయాణించారు. (auto Travel)ఈరోజు బీసీబంధు లబ్ధిదారుడి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం(BC Bandhu Scheme) ద్వారా ఆటో కొన్నానని తెలిపారు. దేవరాజు కోరిక మేరకు కేటీఆర్‌ కాసేపు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్‌గా కేటీఆర్‌ […]

Published By: HashtagU Telugu Desk
Brs

KTR: Former minister KTR who once again traveled by auto

 

KTR: బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్(ktr)మరోసారి ఆటోలో ప్రయాణించారు. (auto Travel)ఈరోజు బీసీబంధు లబ్ధిదారుడి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం(BC Bandhu Scheme) ద్వారా ఆటో కొన్నానని తెలిపారు. దేవరాజు కోరిక మేరకు కేటీఆర్‌ కాసేపు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

చాలా సింపుల్‌గా కేటీఆర్‌ ఆటోలో ప్రయాణించడం పట్ల నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక నిన్న దుబాయ్ జైలు నుంచి విడుదలైన బాధితులను పరామర్శించారు కేటీఆర్. 18 ఏండ్లు దుబాయ్ జైలులో మగ్గి తిరిగి ఇంటికి చేరుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 గురు వ్యక్తులని పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

read also : Bill Gates Enjoys Tea: చాయ్‌వాలాతో బిల్‌గేట్స్‌.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌

కాగా, కేటీఆర్‌ ఇటీవలే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం తర్వాత యూసఫ్‌గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లిన విషయం తెలిసిందే.

 

 

  Last Updated: 29 Feb 2024, 01:14 PM IST