KTR: మా మూడు ప్రధాన హామీల సంగతేంటి మోడీజీ, ప్రధానిపై కేటీఆర్ ఫైర్!

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో కేవలం మూడు రోజుల్లో 2 సార్లు పర్యటించడం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమాత్రం మింగుడుపడటం లేదు.

  • Written By:
  • Publish Date - October 3, 2023 / 12:48 PM IST

KTR: ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల చేరికలు, ఇతర పార్టీల్లోకి జంపింగ్ లతో బిజీగా ఉన్న పార్టీలు.. ఇప్పుడు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో కేవలం మూడు రోజుల్లో 2 సార్లు పర్యటించడం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమాత్రం మింగుడుపడటం లేదు. అయితే మోడీ పర్యటనపై బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పసుపు బోర్డు ప్రకటనను ఎన్నికల ప్రకటనగా తేల్చి చేసిన బీఆర్ఎస్ మోడీపై విమర్శలకు దిగింది. తాజాగా మంత్రి కేటీఆర్ మోడీ పర్యటనపై విరుచుకుపడ్డారు. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…??? మోడీజీ అంటూ ప్రశ్నించారు.

  1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?
  2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?
  3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ?

మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు…..మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది ? అంటూ సూటీగా ప్రశ్నించారు. ‘‘మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. ?? గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ?? కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు, లక్షల ఉద్యోగాలిచ్చే ఐ.టీ.ఐ.ఆర్ ను ఆగం చేశారు. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

‘‘మీ పదేళ్ల పాలనలో.. 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు.  దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు.  పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప.  దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా..? మీ పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉంది. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో.. అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి..! మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా…! మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ…!! అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

Also Read: Ravi Teja: బాలీవుడ్ పై రవితేజ గురి, టైగర్ నాగేశ్వరరావు తో పాన్ ఇండియా క్రేజ్