Site icon HashtagU Telugu

Modi-KTR : రాష్ట్ర విభజన ఫై మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్

Ktr Fire On Modi

Ktr Fire On Modi

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోడీ (PM Modi) ఏపీ రాష్ట్ర విభజన ఫై మాట్లాడిన తీరుపై బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన ఏపీ, తెలంగాణ వర్గాలను సంతృప్తి పరచలేకపోయిందని , కొత్త రాష్ట్రం వచ్చినా తెలంగాణ సంబరాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ఈ పార్లమెంటు భవనంలోనే జరిగిందని, అయితే ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని మోడీ చెప్పుకొచ్చారు. నాడు వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆ మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికా బద్ధంగా జరిగిందని, ఆ మూడు రాష్ట్రాల విభజన అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని, అన్ని చోట్లా సంబరాలు జరిగాయని .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన మాత్రం ఆ విధంగా జరగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, రక్తం చిందించాల్సి వచ్చిందన్నారు. నూతన రాష్ట్రం వచ్చినా తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయిందని మోడీ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రధాని మోడీ దెబ్బ తీస్తున్నారని , అదే సమయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోలేదనడం సరికాదని, ఇది అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటు మీద మోడీ తన అక్కసు వెళ్లగక్కడం, అవమానకరంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. చారిత్రక వాస్తవాల పట్ల మోడీ నిర్లక్ష్య ధోరణికి అతడి మాటలు అద్దం పడుతున్నాయని మంత్రి తెలిపారు.

Read Also : Buying a Car: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే?

స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా నిర్విరామంగా కొట్లాడరని, చివరకు 2014 జూన్ 2వ తేదీన రాష్ట్రం సాకారమైందనే విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు రాష్ట్ర సాధన పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారని, ముఖ్యంగా తెలంగాణ యువత పాత్ర మరువలేనిదని కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మోడీ తెలంగాణ విరోధి అంటూ ట్వీట్‌ను ప్రారంభించారు. అంతకుముందు, కాంగ్రెస్ అర్ధ శతాబ్ధపు పాలన మోసం.. వంచన.. ద్రోహం.. దోఖాలమయం.. అంటూ విమర్శలతో ట్వీట్ చేశారు.

Exit mobile version