KTR : సింగరేణి గొంతు కోస్తున్న బిజెపి..కాంగ్రెస్ నేతలకు బాధలేదు – కేటీఆర్

బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందన్నారు

  • Written By:
  • Publish Date - June 21, 2024 / 09:23 PM IST

వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి.. వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి.. పూలబొకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులిస్తున్నారా? అని భట్టి విక్రమార్క, కిషన్‌ రెడ్డిపై కేటీఆర్‌ మండిపడ్డారు. సిరుల గనికి మరణశాసనం రాస్తూ… చిద్విలాసమా ?? వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటమా ??? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా తెలంగాణ బొగ్గు గనుల వేలం జరిగింది. హైదరాబాద్‌లో 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు మైనింగ్ వేలాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి సతీష్ చంద్ర దూబే, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర బొగ్గు గనుల శాఖ భట్టి విక్రమార్క కు హాజరయ్యారు. ఈ వేలం ఫై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బొగ్గు గ‌నుల వేలం వ‌ద్ద‌ని గ‌తంలో రేవంత్ రెడ్డి ఇదే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈరోజు మాత్రం డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క వేలంలో పాల్గొన్నారు అని మండిప‌డ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదిక గా స్పందిస్తూ..’తెలంగాణ నేలపై.. సింగరేణి గొంతు కోస్తున్న వేళ..డిప్యూటీ సీఎం భట్టి గారికి బాధ లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి రంది లేదు అని సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదు.. సింగరేణి కార్మికులపై అభిమానం లేదన్నారు. ఇద్దరికీ పట్టలేనంత సంతోషం.. మాటల్లో చెప్పలేనంత ఆనందం.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిత్రమే.. వీరి కుమ్మక్కు కుట్రలకు నిలువెత్తు నిదర్శనం అని మండిపడ్డారు.

వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి.. వందేళ్ల సంస్థ భవిష్యత్తును చీకట్లోకి నెట్టి.. పూలబొకేలతో నిస్సిగ్గుగా ఫోటోలకు ఫోజులిస్తున్నారా? అని భట్టి విక్రమార్క, కిషన్‌ రెడ్డిపై కేటీఆర్‌ మండిపడ్డారు. సిరుల గనికి మరణశాసనం రాస్తూ… చిద్విలాసమా ?? వేలాది మంది కార్మికుల జీవితాలతో చెలగాటమా ??? అని ప్రశ్నించారు. ఈ “వేలం” వెర్రి నిర్ణయాల నుంచి.. తెలంగాణ ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసేందుకేనా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికెళ్లి ఈ ఫిరాయింపులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలలైనా గ్యారెంటీలు అమలు చేయలేని.. అసమర్థత నుంచి తప్పించుకునేందుకేనా ఈ కుప్పిగంతులు అని నిలదీశారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నీతి లేని నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందన్నారు. మీ రెండు జాతీయ పార్టీలకు వేసిన ఓటు.. తెలంగాణ జాతి ప్రయోజనాలకే గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు.

Read Also :