Site icon HashtagU Telugu

KTR : కాంగ్రెస్ గ్యారంటీల గారడీతో రాష్ట్రం ఆగమైంది – కేటీఆర్

Ktr

Ktr

‘కాంగ్రెస్ ఆడిన గ్యారంటీల గారడీతో రాష్ట్రం ఆగమైంది. ప్రజలను గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసం క్షమించరానిది’ అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. గాలి మాటల గ్యారంటీలిస్తే మొదటికే మోసం వస్తుందని AICC ఛైర్మన్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)కు ఇప్పుడు అర్థమైనట్లు ఉందని , కర్ణాటక, తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించినప్పుడు బడ్జెట్ గుర్తుకురాలేదా? అని ఆయనను నిలదీశారు. బడ్జెట్‌ చూసుకుని గ్యారంటీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.

గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా అని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో.. తెలంగాణ రాష్ట్రం.. ఏడాదిలోనే ఆగమైందని విమర్శించారు.

తెలంగాణ ప్రజలను నమ్మించి.. నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలన్నారు. అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషమని అన్నారు.

Read Also : TGSPF : తెలంగాణ సచివాలయ బందోబస్తు బాధ్యతలు చేపట్టిన ఎస్పీఎఫ్‌

Exit mobile version