KTR : నమ్మించి మోసం చేసిన ద్రోహులు వారు – కేటీఆర్

మ‌న క‌ష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయ‌కులు కే కేశ‌వ‌రావు, క‌డియం శ్రీహ‌రి పార్టీ నుంచి జారుకుంటున్నారు. ప‌దేండ్లు ప‌ద‌వులు అనుభ‌వించిన త‌ర్వాత‌.. పోయేవాళ్లు రెండు రాళ్లు వేసి పోతారు. అది వారి విజ్ఞ‌త‌కే వదిలేద్దాం

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 04:15 PM IST

పదేళ్లు పార్టీలో అనేక ప‌ద‌వులు అనుభ‌వించి ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉందని చెప్పి..వదిలి వెళ్లిన ద్రోహులు అంటూ కడియం (Kadiyam) , కేకే (KK) తదితరుల ఫై కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం విస్తృత స్థాయి స‌మావేశంలో పాల్గొన్న కేటీఆర్..బిఆర్ఎస్ ను వీడుతున్న నేతలపై , వీడిన నేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

బిఆర్ఎస్ పార్టీకి వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిది…పదేళ్ల పాటు ఉన్నత పదవులు అనుభవించినవారు సైతం పార్టీని వీడుతుండడం తో పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా కేకే, కడియం , పట్నం మహేందర్, దానం నాగేందర్ తదితరుల ఫై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మ‌న క‌ష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయ‌కులు కే కేశ‌వ‌రావు, క‌డియం శ్రీహ‌రి పార్టీ నుంచి జారుకుంటున్నారు. ప‌దేండ్లు ప‌ద‌వులు అనుభ‌వించిన త‌ర్వాత‌.. పోయేవాళ్లు రెండు రాళ్లు వేసి పోతారు. అది వారి విజ్ఞ‌త‌కే వదిలేద్దాం.. కాల‌మే స‌మాధానం చెపుతుంది. ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడు కూడా ప‌ట్ట‌లేడు అంటూ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశార‌ని.. మ‌ళ్లీ రేపు వ‌చ్చి ఇదే రంజిత్ రెడ్డి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి.. కేసీఆర్ కాళ్లు ప‌ట్టుకున్నా పార్టీలోకి రానివ్వం. వాళ్ల‌కుండా త‌ప్ప‌కుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

2014లో విశ్వేశ్వ‌ర్ రెడ్డిని ప‌ట్టుబ‌ట్టి పార్టీలోకి తీసుకొచ్చాను. ఆయ‌న‌కు ఏమైందో తెలియ‌దు కానీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. 2018లో విశ్వేశ్వ‌ర్ రెడ్డిని ప్ర‌జ‌లు ఓడ‌గొట్టారు. 2018లో రంజిత్ రెడ్డి కొత్త వ్య‌క్తి అయినా మీరంద‌రూ ఆశీర్వ‌దించి గెలిపించారు. ఇవాళ రంజిత్ రెడ్డి ద్రోహం చేశారు. బ‌య‌టివాడు మోసం చేస్తే బాధ అనిపించ‌దు. నీతోనే నీడ‌లాగా తిరిగి, నీతోనే అన్ని మంచి మాట‌లు చెప్పి, క‌ష్ట‌కాలంలో ఉంటామ‌ని మాట చెప్పి.. క‌విత అరెస్టు అయిన‌రోజే న‌వ్వుకుంటా రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. దాన్ని మ‌నం త‌ప్ప‌కుండా తీర్చుకోవాలి. రాజ‌కీయాల్లో ఎవ‌రికీ అధికారం శాశ్వ‌తం కాదు. అధికారం పోగానే త‌మ స్వీయ ప్ర‌యోజ‌నాల కోసం ద్రోహం చేసి పోతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also :  Kangana Ranaut : జై శ్రీరామ్ నినాదాలతో కంగనా రనౌత్ రోడ్ షో