Medigadda Barrage : ఇంతకాలం కాంగ్రెస్ చేసింది.. విష ప్రచారమని తేలిపోయింది – కేటీఆర్

అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు..మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 07:26 PM IST

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఫై రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండాన్ని బిఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఓ పక్క తమ పార్టీ నేతలు , గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నప్పటికీ , ఏమాత్రం బెదురూ లేకుండా ప్రభుత్వం ఫై పోరాటం చేస్తుంది. అధికారం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శిస్తూనే..ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలుస్తుంది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు, ఆందోళనలు , నిరాహార దీక్షలు చేస్తూ వస్తుంది.

ఈరోజు గాంధీ హాస్పిటల్ వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు వెళితే నిరుద్యోగ యువకులపై లాఠీ ఛార్జ్ చేయడం ఏంట‌ని మండిపడ్డారు. ప్రజాపాలనలో పరామర్శించటం, నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నిరుద్యోగులను తరుముతూ పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని ఆరోపించారు.

అలాగే మేడిగడ్డ బ్యారేజ్ , అన్నారం బ్యారేజీ లపై కాంగ్రెస్ చేసిన ప్రచారం ఫై కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్నటి దాకా…

మేడిగడ్డ మేడిపండులా మారింది అన్నారు..
అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు.
మరమ్మత్తులు చేసినా.. ఇక పనికి రాదన్నారు.
లక్షకోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నారు.
వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతది అన్నారు.
అన్నారం బ్యారేజీ కూడా కూలిపోతది అన్నారు.

నేడు మాత్రం..

మేడిగడ్డ మరమ్మత్తులు పూర్తి అంటున్నారు..
అంటే…
ఇంతకాలం కాంగ్రెస్ చేసింది..
విష ప్రచారమని తేలిపోయింది

8 నెలల నుంచి చేసింది..
కాలయాపనే అని రుజువైపోయింది

రిపేర్ల మాటున జరిగింది..
చిల్లర రాజకీయమని వెల్లడైపోయింది

ఇకనైనా..
కేసిఆర్ గారి జల సంకల్పాన్ని..
హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలి

వరప్రదాయిని లాంటి ప్రాజెక్టుపై..
విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలి

కల్పతరువు లాంటి ప్రాజెక్టుపై
కుట్రలు చేసిన వారు తప్పు ఒప్పుకోవాలి

తెలంగాణకే తలమానికమైన ప్రాజెక్టును
తప్పుబట్టిన వారు ముక్కు నేలకు రాయాలి

జై తెలంగాణ
జై కాళేశ్వరం

అంటూ ట్విట్టర్ (X) వేదికగా పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ కు నెటిజన్ల నుండి విశేష స్పందన వస్తుంది.

Read Also : TGSRTC : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్మార్ట్ కార్డ్‌లతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం