Site icon HashtagU Telugu

CNG Leaders : మీరేమో చేపకూరలతో భోజనాలు.. విద్యార్థులేమో పస్తులుండాలా..? – కేటీఆర్

Ktr Cng

Ktr Cng

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Prajapalana) ప్రజా పాలన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. హెలికాప్టర్ యాత్రలు చేసుకుంటూ, చేపకూర విందులతో ఎంజాయ్ చేసే మంత్రులు, హాస్టల్ విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల బాగోగులను పట్టించుకోవడం లేదని, అన్నం వండకపోగా విద్యార్థులను దేవాలయాల్లో అన్నదానం కోసం వెళ్లాలని చెప్పడం అమానుషమని కేటీఆర్ విమర్శించారు.

AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్ పై రోజా కౌంటర్

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలంలోని కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్‌లో శివరాత్రి రోజున 380 మంది విద్యార్థులుండగా, అందులో 200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించలేకపోయారని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థులకు భోజనం సిద్ధం చేయకుండా హాస్టల్ సిబ్బంది, వారు గుదిబండ శివాలయంలో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కోసం గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినాలని చెప్పడం దారుణమని కేటీఆర్ తెలిపారు. విద్యార్థులు భోజనం కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే.. మంత్రులు మాత్రం చేపకూరలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.

పండగ రోజునే విద్యార్థులను పస్తులుంచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనా విధానమా అని కేటీఆర్ ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. విద్యార్థుల ఆకలిని తీర్చలేని ప్రభుత్వం అభివృద్ధి గురించి ఎలా మాట్లాడతుందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.