Site icon HashtagU Telugu

Sita Rama Lift Irrigation Project : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ కమిషన్ వేయాలి..? – KTR

Ktr

Ktr

సీతారామ ఎత్తిపోతల పథకం (Sita Rama Lift Irrigation Project)లో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని KTR ప్రశ్నించారు. కాళేశ్వరంపై కమిషన్ వేసిన మీపై ఇప్పుడు ఏ కమిషన్ వేయాలి..? ఢిల్లీ నేస్తం – అవినీతి హస్తం’ అంటూ ట్విటర్ లో కేటీఆర్ విమర్శలు చేశారు.

సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై కేటీఆర్ మండిపడ్డారు. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వారు.. కాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు.. ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని నిలదీశారు. సుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలు ఎలా తుంగలో తొక్కారని ప్రశ్నించారు. ఒక మీటింగ్ లో త్వరగా టెండర్లు పిలవాలి అని ఆదేశిస్తారని.. మరో మీటింగ్‌లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడుతారని ధ్వజమెత్తారు.

Read Also : KTR : మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మట్టి కొట్టింది: కేటీఆర్‌