Site icon HashtagU Telugu

KTR : బిజెపి , కాంగ్రెస్ నేతలను గంగిరెద్దులోళ్లతో పోల్చిన కేటీఆర్

Ktr Bjp Cng

Ktr Bjp Cng

తెలంగాణ రాజకీయలు మరింత కాకరేపుతున్నాయి. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ నేతలు ఎక్కడ తగ్గడం లేదు. కాంగ్రెస్ నుండి రేవంత్ తన మాటల తూటాలు వదులుతుంటే..ఇక బిఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు లు కాస్త గట్టిగా వాయిస్ ఇస్తున్నారు. ఓ పక్క గులాబీ బాస్ ప్రజా ఆశీర్వాద సభ లతో ఎన్నికల ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ఫై విరుచుకపడుతుంటే..వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మరోపక్క నియోజకవర్గాలలో పర్యటిస్తూ కాంగ్రెస్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నేడు మంగళవారం నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ (Minister KTR).. కాంగ్రెస్ , బిజెపి లపై విరుచుకపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు ఇన్ని రోజులు ప్రజల్లో లేని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లకు పైసలు ఎక్కువై బలిసి కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కర్ణాటక కాంట్రాక్టర్ల నుంచి బాగా పైసలు వచ్చేసరికి కోమటిరెడ్డి బ్రదర్స్ (KomatiReddy Brothers) ఎగిరెగిరి పడుతున్నారని .. బీఆర్ఎస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించి డబ్బు మదం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్స్ రాగానే ఆగం కావొద్దు అని ప్రజలకు సూచించారు.

ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కూడా డబ్బు సంచులతో ఎగిరెగిరి పడుతున్నారు, డబ్బుతోనే ఓట్లను కొని గెలిచే పని అయితే మంచి మానవత్వం ఎందుకంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు అరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండి చేసింది ఏమీ లేదు, తెలంగాణాలో మూడవసారి కేసీఆర్ సీఎం అయితే పేద ప్రజలు అందరికీ మంచి జరుగుతుంది అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెల్ల కార్డు ఉంటే చాలు కేసీఆర్ భీమా, సన్నబియ్యం లాంటి అన్ని పధకాలు హామీలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Read Also : BJP : బిజెపి చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు