MLA KTR: ఢిల్లీ ప్రదక్షణలేనా.. రైతుల్ని పట్టించుకునేదేమైనా ఉందా: కేటీఆర్

రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నీరు లేక పంటలు నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు

MLA KTR: రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నీరు లేక పంటలు నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కాకుండా రైతుల కన్నీళ్లు కూడా చూడాలని సూచించారు. ఎన్నికల లక్ష్యం తప్ప నానా అవస్థలు పడుతున్న రైతులపై కనికరం లేదా అని ప్రశ్నించారు. సీట్లు, ఓట్ల పంచాయితీ తప్ప. ప్రజాస్వామ్యం అక్కర్లేదా అన్నారు. పార్టీ ఫిరాయింపులపై పెట్టిన దృష్టి పంట నష్టంపై ఎందుకు లేదని సీఎం రేవంత్ ని సూటిగా ప్రశ్నించారు.

హైకమాండ్ చుట్టూ తిరుగుతున్నారు , మరి నష్టపోయిన రైతుల్ని పరామర్శించే సమయం లేదా అంటూ ఫైర్ అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి, వాటికీ నీరందడం లేదని చెప్పారు. కాగా బీఆర్‌ఎస్‌ ద్వారా అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటంచేస్తామని హెచ్చరించారు కేటీఆర్‌.

అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వానికి చురకలంటించారు. బుధవారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయడం తగదన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్పులు చేసి పంటలు వేసుకున్నామని రైతులు వాపోయారు. వారు తెచ్చుకునే సమయానికి అకాల వర్షాలు కురవడంతో నీటమునిగింది.

గత పదేళ్లలో ఒక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం అందలేదన్నారు. ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి. పంటల బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల పేరుతో రైతులను వేధించడం తగదన్నారు. కాగా రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు సిరిసిల్ల జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి.

Also Read: Forests: అడవులను కాపాడుకుందా.. అవసరాలను తీర్చుకుందాం…!