Site icon HashtagU Telugu

KTR : కేటీఆర్ కు గాయం…ఆందోళనలో అభిమానులు..!!

Ktr 1

Ktr 1

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శనివారం కిందపడిపోయారట. బిజీ షెడ్యూల్స్ తో ఉరుకులు పరుగులు పెట్టే కేటీఆర్ శనివారం కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోఓ కార్యక్రమంలో ఆయన కింద పడిపోయారు. ఈ సందర్భంగా ఆయన కాలు చీలమండలానికి దెబ్బ తగిలింది. దీంతో ఆయన ఇంటికి కాలి చీలమండకు పెద్ద బూటు లాంటి బ్యాండేజీ వేసుకుని రెస్టు తీసుకుంటున్నారు.

ఓ కార్యక్రమానికి హాజరైన క్రమంలో కిందపడిపోయానని…దీంతో చీలమండ దెబ్బతిన్నదని కేటీఆర్ శనివారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. చీలమండకు బ్యాండేజీ వేసుకుని కూర్చున్న ఫొటోను దానికి జత చేశారు. మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని కేటీఆర్ తెలిపారు. కాలక్షేపం కోసం ottలో ఏమైనా మంచి కార్యక్రమాలు ఉంటే తెలియజేయాలని కోరారు.