KTR : కామెడీని సీరియ‌స్‌గా తీసుకోవ‌ద్దు- ఫ‌రూఖీ, క‌మ్రాల‌పై కేటీఆర్‌

హిందూ వ్య‌తిరేకులుగా ముద్ర‌ప‌డ్డ క‌మెడియ‌న్ల ఫ‌రూఖీ, క‌మ్రాల ప్ర‌ద‌ర్శ‌న‌కు మంత్రి కేటీఆర్ బ‌హిరంగ ఆహ్వానం ప‌లికాడు. వాళ్ల షోల‌ను దేశంలోని 12 న‌గ‌రాల్లో ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ హైద‌రాబాదులో షో నిర్వ‌హించాల‌ని కోర‌డం హిందూ గ్రూపుల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

  • Written By:
  • Updated On - December 18, 2021 / 05:16 PM IST

కాంట్ర‌వ‌ర్షియ‌ల్ క‌మెడియ‌న్స్‌ ఫ‌రూఖీ, క‌మ్రాల ప్ర‌ద‌ర్శ‌న‌కు మంత్రి కేటీఆర్ బ‌హిరంగ ఆహ్వానం ప‌లికాడు. వాళ్ల షోల‌ను దేశంలోని 12 న‌గ‌రాల్లో ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ హైద‌రాబాదులో షో నిర్వ‌హించాల‌ని కోర‌డం హిందూ గ్రూపుల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. మునావ‌ర్ ఫ‌రూఖీ, కునాల్ క‌మ్రా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం మ‌రోసారి టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య ర‌గ‌డ‌గా మారే అవ‌కాశం లేక‌పోలేదు. కర్నాట‌క ప్ర‌భుత్వం వాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను బెంగుళూరులో ఇటీవ‌ల ర‌ద్దు చేసింది. కానీ, నిజ‌మైన కాస్మోపాలిట‌న్ సిటీగా ఉన్న హైద్రాబాద్ లో ప్ర‌ద‌ర్శ‌నను ర‌ద్దు చేసే ప్ర‌సక్తే లేద‌ని, స్టాండ్ అప్ క‌మెడియ‌న్ల‌గా పేరున్న‌ ఫ‌రూఖీ, క‌మ్రాల‌కు బ‌హిరంగ ఆహ్వానం ప‌లికాడు కేటీఆర్.

హిందూ దేవ‌త‌ల‌ను అవ‌మానిస్తూ ఫ‌రూకీ చేసిన షోల‌ కార‌ణంగా ఆయ‌న్ను ఇండోర్ జైల్లో పెట్టారు. నెల రోజుల జైలు జీవితం త‌రువాత ప‌లు చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అనుమ‌తులు ల‌భించ‌లేదు. వివాద‌స్ప‌ద వ్య‌క్తిగా ఫ‌రూఖీని దేశ వ్యాప్తంగా హిందువులు గుర్తించారు. అందుకే, లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంద‌ని బెంగుళూరు ప్ర‌ద‌ర్శ‌న‌ను అక్క‌డి పోలీసులు ర‌ద్దు చేశారు.హిందుత్వ గ్రూపులలు దేశ వ్యాప్తంగా ఫరూఖీని నిరంతరం వెంటాడుతున్నారు. ఆయ‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు ఎక్క‌డ ఉన్నాయ‌ని తెలిసిన‌ప్ప‌టికీ ర‌ద్దు చేయ‌డానికి హిందూ గ్రూప్ లు ప‌ట్టుబ‌డుతున్నాయి. ఆ క్ర‌మంలో సూరత్, అహ్మదాబాద్, వడోదర, ముంబై, రాయ్‌పూర్ , బెంగళూరు ప్రాంతాల్లో ఇటీవ‌ల‌ అతని ప్రదర్శనలు చేయ‌లేక‌పోయాడు.అందుకే వాళ్ల‌ను బ‌హిరంగంగా ఆహ్వానిస్తోన్న మంత్రి కేటీఆర్ బెంగుళూరులో ర‌ద్దు చేసిన వారికి చ‌ర‌కులు కూడా వేశాడు. కామిడీగా చేసే షోల్లోని అంశాల‌ను సీరియ‌స్ గా ఎందుకు తీసుకుంటార‌ని శుక్ర‌వారం ఒక కార్య‌క్ర‌మంలో కేటీఆర్ వ్యాఖ్యానించాడు.భారతదేశం అంతటా ఫ‌రూఖీ, క‌మ్రా 12 ప్రదర్శనల రద్దు చేయడంతో ఇక వాళ్లు కామెడీని విడిచిపెట్టవచ్చని టాక్ వ‌చ్చింది. “ప్రజా భద్రత” కారణంగా గుర్గావ్ కామెడీ ఫెస్టివల్ నుండి ఫ‌రూఖీ తొలగించబడ్డాడు. అత‌న్ని హైద్రాబాద్ ఆహ్వానిస్తుంద‌ని మ్యాచూసూట్‌ చెందిన ఆర్థిక సేవల సంస్థ మాస్ మ్యూచువల్ నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ అన‌ర‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.