Site icon HashtagU Telugu

Rahul : కాంగ్రెస్‌లో చేరేందుకు ఎంతమొత్తం ఇస్తున్నారు..? రాహుల్ కు కేటీఆర్ సూటి ప్రశ్న

Ktr Rahul Gandhi

Ktr Rahul Gandhi

గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ పార్టీ (BRS ) ఎమ్మెల్యేలను ..కాంగ్రెస్ పార్టీ (Congress Party) లాక్కుంటున్న సంగతి తెలిసిందే. ఏంచెప్పి ఆహ్వానిస్తుందో తెలియదు కానీ ఇప్పటికే 09 మంది అధికారికంగా కాంగ్రెస్ లో చేరగా..శనివారం రాత్రి పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సైతం సీఎం రేవంత్ ను కలవడం తో ఈయన కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలా వరుసగా నేతలు వెళుతుండడం తో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..రాహుల్ గాంధీ కి సూటి ప్రశ్న సంధించారు.

తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎంత ఆఫర్‌ చేస్తున్నదని రాహుల్‌గాంధీని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్‌ చేస్తున్నదని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆరోపించిన వార్తను కేటీఆర్‌ ట్యాగ్‌ చేశారు. కర్ణాటకలో బీజేపీ ‘ఆపరేషన్‌ కమల’ను అమలు చేస్తున్నదని, అందులో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను రాజీనామా చేసి రమ్మంటున్నదని, ఉప ఎన్నికల్లో వారికి నిధులను సమకూరుస్తామని హామీ ఇస్తున్నదని సిద్దరామయ్య ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఎంతమొత్తం ముట్టజెప్తున్నదని కేటీఆర్‌ పరోక్షంగా నిలదీశారు. తెలంగాణలో ఆర్‌ఆర్‌ (రేవంత్‌ రెడ్డి) టాక్స్‌ కలెక్షన్లు త్రిపుల్‌ ఆర్‌, కల్కి2898 సినిమాల కలెక్షన్లు మించిపోయాయి కదా? అంటూ ఎద్దేవా చేశారు.

Read Also  : 5 Month Old Baby Raped : ఏపీలో ఘోరం.. 5 నెలల చిన్నారిపై అత్యాచారం