Site icon HashtagU Telugu

KTR : జహీరాబాద్‌లో 1000 కోట్లతో మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ ప్లాంట్.. KTR శంకుస్థాపన..

KTR did the ground breaking of Mahindra new EV manufacturing line at Zaheerabad

KTR did the ground breaking of Mahindra new EV manufacturing line at Zaheerabad

తెలంగాణ(Telangana)లో ఇటీవల మంచి మంచి పరిశ్రమలు తమ పెట్టుబడులను పెడుతున్నాయి. తెలంగాణలో తమ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ జహీరాబాద్(Zaheerabad) లో ఎలక్ట్రిక్ వెహికల్(Electric Vehicle) తయారీ యూనిట్ కోసం ఏకంగా 1000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. తాజాగా నేడు ఈ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమం జరగగా తెలంగాణ మంత్రి KTR పాల్గొన్నారు.

జహీరాబాద్ లోని మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహేంద్ర అండ్ మహేంద్ర వారు తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి 1000 కోట్ల పెట్టుబడి జహీరాబాద్ లో పెట్టడం సంతోషంగా ఉంది. TS ఐ పాస్ ద్వారా 21రోజుల్లో పరిశ్రమ స్థాపనలకు అన్ని అనుమతులు ఇస్తున్నాము. TS ఐ పాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత 23 వేల పరిశ్రమలు నెలకొల్పాము. TS ఐ పాస్ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల 30 వేల పెట్టుబడులు వచ్చాయి. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. కొత్తగా వచ్చే కంపెనీలలో స్థానిక యువతకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాము. త్వరలోనే జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాము అని తెలిపారు.

అలాగే ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీలో, తెలంగాణ ప్రైవేట్ వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాము. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమల కోసం ప్రణాళికలు చేస్తున్నాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారాలనే లక్ష్యంతో పని చేస్తున్నాము. హైదరాబాద్ లో ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా పలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాము అని అన్నారు.

 

Also Read :  Errabelli Dayakar Rao : వరంగల్‌లో ఫిలిం స్టూడియో పెట్టండి.. KCRతో మాట్లాడి ఎంత భూమి కావాలన్నా ఇప్పిస్తా..