Site icon HashtagU Telugu

Hyderabad: రేవంత్ సర్కార్ ని ఇరకాటంలో పడేస్తున్న కేటీఆర్

Hyderabad

Hyderabad

Hyderabad: తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. గడిచిన 100 రోజుల్లో పాలనాపరంగా ఫర్వాలేదనిపించినా ఎక్కడో సమన్వయ లోపం కారణంగా కొన్ని సమస్యలు కళ్ళముందే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మూడు నెలలుగా బయటకు రాలేదు. దీంతో పార్టీ కేటీఆర్, హరీష్ రావు మోస్తున్నారు.  అయితే వారం రోజులుగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్పీడు పెంచింది. కేసీఆర్ రైతుల వద్దకు వెళ్తున్నారు. పంట నష్టపోయిన రైతన్నలను కలిసి పరామర్శిస్తున్నారు. రాజకీయంగా కేటీఆర్ అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నికల హామీలను నిరవేర్చాలను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య మరింత పెరిగింది. ట్యాంకర్లకు వేలు పెట్టి కొనాల్సిన పరిస్థితి. దీంతో స్థానికులు ఇదే విషయాన్నీ కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. లోకసభ ఎన్నికల్లో భాగంగా నగరంలో పరిస్థితులపై సమీక్షిస్తున్న కేటీఆర్ తాజాగా హైదరాబాద్ నీటి సమస్యపై సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తాగునీరు, సాగునీటి కొరత తీవ్రంగా ఉందని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రజలకు ఉచితంగా ట్యాంకర్‌ సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క మార్చిలోనే హైదరాబాద్‌లో 2.30 లక్షలకు పైగా వాటర్‌ ట్యాంకర్లు బుక్‌ అయ్యాయి. “20,000 లీటర్ల తాగునీరు ఉచితంగా ఇవ్వాలి, ప్రభుత్వం ట్యాంకర్లకు ఎలా రుసుము వసూలు చేస్తుంది? వాటిని ఉచితంగా సరఫరా చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో తాగునీటి సమస్య రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్వాకం వల్లనే అని కేటీఆర్‌ ఎత్తిచూపారు. మిషన్ భగీరథలో ప్రధానమైన దిగువ మేనేరు దాదాపు ఎండిపోతోంది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంతో వ్యవసాయ భూమి ఎండిపోయిందన్నారు. అయితే గత సీజన్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం కారణంగానే తాగు, సాగునీటి సంక్షోభం ఏర్పడిందన్న కాంగ్రెస్ వాదనను తప్పు పట్టారు కేటీఆర్. గత ఏడాది వర్షాలు సగటు కంటే 14 శాతం ఎక్కువగా నమోదయ్యాయని ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయన్నారు.

We’re now on WhatsAppClick to Join.

సింగూరు, ఎల్లంపల్లి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నాగార్జున సాగర్‌లలో సరిపడా నీరు ఉన్నందున ప్రభుత్వం చేయాల్సిందల్లా నీటిని సద్వినియోగం చేసుకోవడమే. సుంకిశాల ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని ఎత్తిపోసేందుకు దీనిని ఉపయోగించుకోగలగాలి’’ అని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు కొండపోచమ్మ సాగర్‌ను నింపేందుకు ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న 208 మంది రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేం పెట్టిన అంకెల్లో నిజానిజాలేంటని ముఖ్యమంత్రి అడుగుతున్నారని, ఆయనే సీఎం అని, నిజానిజాలు తేల్చాలని కేటీఆర్ అన్నారు.

Also Read: Judson Bakka : కాంగ్రెస్ పార్టీ నుంచి బక్క జడ్సన్ బహిష్కరణ..