Site icon HashtagU Telugu

TG : రేవంత్ రెడ్డి ని ఎందుకు జైల్లో పెట్టకూడదు..? – కేటీఆర్ ప్రశ్న

KTR

Telangana Women's Commission notice to former minister KTR

సీఎం రేవంత్ రెడ్డి ఫై మరోసారి విరుచుకపడ్డారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఫేక్ వార్తల ప్రచారానికి అలవాటు పడ్డ CM రేవంత్ రెడ్డి ని జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ ప్రశ్నించారు. ‘నా బంధువుకు రూ.10,000కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ అబద్ధం చెప్పాడు. నేను సెక్రటేరియట్ కింద ఉన్న నిజాం ఆభరణాలను తవ్వినట్లు నకిలీ కథనాన్ని సృష్టించాడు. కేంద్ర హోంమంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారు. ఓయూకి సంబంధించిన నకిలీ సర్క్యులర్ను పోస్ట్ చేశాడు’ ఇలా ఇన్ని నకిలీలు చేసిన ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదంటూ ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం కేటీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. నేడు శుక్రవారం నల్లగొండ జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తున్నారు. జిల్లాలోని నకిరేకల్‌, మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో జరుగనున్న సమావేశాల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు నకిరేకల్‌లోని సువర్ణ గార్డెన్స్‌లో మీటింగ్‌కు హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్‌ మండలం దామెరలోని బాలాజీ గార్డెన్స్‌లో సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటలకు దేవరకొండలోని సాయిశివ ఫంక్షన్‌ హాల్‌లో జరిగే సమావేశానికి కేటీఆర్‌ హాజరు కానున్నారు.

ఇక రేపటితో ఎమ్మెల్యే ఉప ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరుగనుండగా.. నిబంధనల ప్రకారం పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు ప్రచారం బంద్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నెల 25న సాయంత్రం 4గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది. ఆ తర్వాత ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు.

Read Also : జగన్ ప్రమాణ స్వీకారం కోసం వైజాగ్ లో భారీగా హోటల్ రూమ్స్ బుకింగ్ ..