Site icon HashtagU Telugu

Young India Skill University : అదానీ రూ.100 కోట్ల విరాళంపై కేటీఆర్ విమర్శలు

Gautam Adani 100 Crores

Gautam Adani 100 Crores

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skill University)కి అదానీ రూ.100 కోట్ల విరాళం ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేట్‍లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీలో 17 కోర్సుల్లో ప్రతి సంవత్సరం 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఈ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ (Adani Group) భారీ విరాళం ప్రకటించింది. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth)ని కలిసి రూ.100 కోట్ల (Rs 100 crore) చెక్కు అందజేశారు. అదానీ రూ.100 కోట్లు ఇవ్వడం ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ స్పందించారు.

‘ఢిల్లీ కాంగ్రెస్ నేతలేమో మోదీ+అదానీ.. మొదానీ అంటారు. మరి ఇప్పుడది రేవంత్+అదానీ.. రేవదానీ, రాహుల్ గాంధీ+అదానీ.. రాగదానీ అని అనాలేమో? దీంతోనే కాంగ్రెస్ వంచన బయటపడింది’ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు.

Read Also : Virat Kohli Runs: మూడో రోజు ధాటిగా ఆడిన భార‌త్‌.. ప్ర‌త్యేక క్ల‌బ్‌లో చేరిన‌ విరాట్ కోహ్లీ!