Site icon HashtagU Telugu

KTR on Modi: మోడీకి కేటీఆర్ పంచ్.. అబద్దాల్లోనూ ఫెయిల్ అంటూ కౌంటర్!

KTR, bjp govt

Ktr And Modi

తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ (BJP) చేస్తున్న ఆరోపణలను, వాఖ్యలను తిప్పికొడుతున్నారు. తాజాగా మరోసారి కేటీఆర్ మోడీ (PM Modi)కి కౌంటర్ ఇచ్చాడు. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో తమ తప్పేం లేదని, ఉన్న జిల్లాల్లోనే మళ్లీ కాలేజీలు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపి తప్పు చేసిందని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనికి పక్కా ఆధారాలతో కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్ (KTR). కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సిగ్గుతో ప్రభుత్వం తలదించుకునేలా చేశారాయన. తెలంగాణ (Telangna) ప్రజానీకం ముందు మరోసారి బీజేపీని దోషిగా నిలబెట్టారు.

అబద్ధాలు  (Lies) చెప్పి అడ్డంగా దొరికిపోయిన కేంద్ర మంత్రులు పోనీ నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలే నిజమనుకుందాం. అదే నిజమైతే, గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఇచ్చిన స్టేట్ మెంట్లు అబద్ధం అయి ఉండాలి. పోనీ వారి స్టేట్ మెంట్లే నిజమైతే, నిర్మలా సీతారామన్ అసత్యాలు వల్లెవేసి ఉండాలి. ఆ ముగ్గురు మంత్రులు వేర్వేరు సందర్భాల్లో మెడికల్ కాలేజీల గురించి ఏం మాట్లారో, వారి అఫిషియల్ ఖాతాల నుంచి వేసిన ట్వీట్లు, పేపర్ కటింగ్స్ తో సహా ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేటీఆర్. ప్రస్తుతం కేటీఆర్ (KTR) ట్వీట్ వైరల్ గా మారుతోంది.

Also Read: Pujara Duck Out: 100 టెస్ట్ లో పుజార డకౌట్.. నిరాశపర్చిన స్టార్ బ్యాట్స్ మెన్

 

Exit mobile version