Site icon HashtagU Telugu

KTR : కేసీఆర్ ఫై ఈటెల పోటీ ఫై కేటీఆర్ కామెంట్స్

Ktr Comments Etela

Ktr Comments Etela

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Etela Rajender) .. కాస్కో సీఎం (CM KCR) ..నీపై నేను పోటీ చేయబోతున్న అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ (Etela Rajender Will Contest Against KCR) పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి తాను బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ తో పాటు, గజ్వేల్ లోను పోటీ చేస్తానని ఈటల స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఎలాగైతే రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నారో.. తాను కూడా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తానని, రెండింటిలోనూ తానే విజయం సాధిస్తానని, కేసీఆర్ ను చిత్తుగా ఓడిస్తానని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ‘బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో. ఈటల రాజేందర్ గజ్వేల్‌ లోనే కాదు.. ఇంకా 50 చోట్ల పోటీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పోటీ చేస్తున్న రెండు చోటా మేమే గెలుస్తాం’ అని వ్యాఖ్యానించారు. అమిత్ షా అబ‌ద్ధాల‌కు హ‌ద్దే లేద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. బీజేపీని వారి నాయ‌క‌త్వ‌మే సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవ‌డం ఖాయం. బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఫై కూడా కేటీఆర్ పలు సెటైర్లు వేశారు.

తెలంగాణ‌లో 40 చోట్ల అభ్య‌ర్థులే లేని కాంగ్రెస్.. 70 చోట్ల గెలుస్తామ‌ని ఆ పార్టీ నాయ‌కులు ఎలా చెబుతార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. కూక‌ట్‌ప‌ల్లి సీటు కోసం రూ. 15 కోట్లు అడిగార‌ని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు. నేను చెప్పిన‌ట్టే క‌ర్ణాట‌క‌లో అక్ర‌మ డ‌బ్బు జ‌మ అవుతోంది. ఇప్ప‌టికే రూ. 8 కోట్లు కొడంగ‌ల్ చేరిన‌ట్టు స‌మాచారం ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడ‌ర్ కాదు.. రీడ‌ర్ అని కేటీఆర్ విమ‌ర్శించారు. పొన్నాల ల‌క్ష్మ‌య్య (Ponnala Lakshmaiah) బీఆర్ఎస్‌లో చేరుతానంటే రేపే వెళ్లి ఆహ్వానిస్తాను. త్వ‌ర‌లో చాలా మంది ప్ర‌ముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత గాంధీ భ‌వ‌న్‌లో త‌న్నుకుంటారు. కాంగ్రెస్‌లో సీఎం ప‌ద‌వికి ఇద్ద‌రి మ‌ధ్య అంగీకారం కుదిరిన‌ట్టు స‌మాచారం ఉంద‌న్నారు.

Read Also : Dussehra Special : దేశంలోని 6 చోట్ల దసరా వేడుకలు వెరీ స్పెషల్