KTR: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కుట్రపూరితంగా తప్పిస్తోంది!

KTR: ‘‘తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్ గారి బాటలో… ఈరోజు తమ పదవులకు రాజీనామా చేసిన శ్రీ కొండూరి రవీందర్ రావు, గోంగిడి మహేందర్ రెడ్డి నిర్ణయం అభినందనీయం. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా లొంగకుండా.. నమ్మి నడిచిన BRS పార్టీ, కెసిఆర్ బాటకే జై కొట్టారు’’ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘తమ పదవీకాలంలో రాష్ట్రంలో సహకార […]

Published By: HashtagU Telugu Desk
Ktr

As if there is a government in the state..? As if not..? : Criticism of KTR

KTR: ‘‘తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకల వదిలివేయడం నేర్పిన కేసీఆర్ గారి బాటలో… ఈరోజు తమ పదవులకు రాజీనామా చేసిన శ్రీ కొండూరి రవీందర్ రావు, గోంగిడి మహేందర్ రెడ్డి నిర్ణయం అభినందనీయం. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ఎన్ని ప్రలోభాలకు, ఒత్తిడిలకు గురి చేసినా లొంగకుండా.. నమ్మి నడిచిన BRS పార్టీ, కెసిఆర్ బాటకే జై కొట్టారు’’ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

‘‘తమ పదవీకాలంలో రాష్ట్రంలో సహకార బ్యాంకులను అద్భుతంగా నడిపిన వీరి పేరు రాష్ట్ర సహకార రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పదివేల కోట్ల రూపాయల రుణాలతో ఉన్న టెస్కాబ్ ను 42,000 కోట్ల సంస్థగా తీర్చిదిద్ది, వినియోగదారుల సంఖ్యతో పాటు, డిపాజిట్లను మూడు రెట్లు పెంచి నమ్మకమైన సంస్థలుగా తయారు చేశారు’’ అని అన్నారు.

‘‘టెస్కాబ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి… అనేక అవార్డులతో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ నిలిచింది. వీరి రాజీనామా, నాయకత్వ లేమి రాష్ట్ర కోపరేటివ్ రంగానికి తీరని లోటు అవుతుంది. అత్యుత్తమంగా పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులను కుట్రపూరితంగా పక్కకు తప్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తున్నది’’ అని కేటీఆర్ మండిపడ్డారు.

  Last Updated: 31 May 2024, 09:12 PM IST