Site icon HashtagU Telugu

KTR : ఆదిలాబాద్‌లో రైతులపై లాఠీ ఛార్జ్‌..ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్‌

KTR

Telangana Women's Commission notice to former minister KTR

ఆదిలాబాద్‌‌ జిల్లా(Adilabad District) కేంద్రంలోని విత్తల దుకాణాల(Seed stores) వద్ద తీవ్ర ఉద్రిక్తత(tension) ఏర్పాడింది. ప్రతి విత్తనాల( seeds) కోసం రైతులు(Farmers) క్యూ కట్టారు. అయితే స్టాక్‌ లేదని చెప్పండంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు జీలుగ, జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయం కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2,500 బస్తాల విత్తనాలు అవసరం ఉండగా 1000 బస్తాలే అందజేశారని మండిపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఆదిలాబాద్‌లో రైతన్నలపైన లాఠీచార్జిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం(Govt) వెంటనే క్షమాపణ(apology) చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అని కేటీఆర్ మండిపడ్డారు.

Read Also: Shreyas Iyer: రోహిత్ త‌ర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా అయ్య‌ర్‌..?

రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి కేటీఆర్ సూచించారు. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే. రాష్ట్రంలో రైతన్నల సమస్యలపైన ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి. రైతన్నలపైన లాఠీచార్జ్ చేసిన అధికారులపైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నలపైన ప్రభుత్వ దాడులు ఇలానే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని కేటీఆర్ హెచ్చరించారు.