Site icon HashtagU Telugu

KTR : జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కేటీఆర్

Ktr Complaint To Dgp

Ktr Complaint To Dgp

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (COngress) అధికారం చేపట్టిన దగ్గరి నుండి జ‌ర్న‌లిస్టుల‌పై (Generalists) దాడులు ఎక్కువైపోతున్నాయి. ప్రశ్నించాల్సిన గొంతును ఈ సర్కార్ నొక్కేస్తుంది. కాంగ్రెస్ నేతలే కాదు పోలీసులు సైతం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ జ‌ర్న‌లిస్టుల‌పై దాడులకు తెగపడుతున్నారు. ఇప్పటికే పలు ఘటనలు వెలుగులోకి రాగా…తాజాగా మహిళ జ‌ర్న‌లిస్టుల‌పై దాడి జరగడం ప్రభుత్వం ఫై మరింత ఆగ్రహాన్ని నింపుతుంది. కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా జ‌ర్న‌లిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర డీజీపీ కార్యాల‌యంలో డీజీపీ జితేంద‌ర్‌ను బీఆర్ఎస్ నాయ‌కులు శుక్ర‌వారం కలిశారు. రాష్ట్రంలో రైతులపై , జ‌ర్న‌లిస్టుల‌పై జరుగుతున్న దాడులను డిజిపి దృష్టికి తీసుకెళ్లారు. నిన్న సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిప‌ల్లిలో జ‌ర్న‌లిస్టుల‌పై జ‌రిగిన దాడుల‌పై డీజీపీకి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. దాడుల‌కు పాల్ప‌డ్డ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ నేత‌లు డిమాండ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 150 మంది వారిని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ మీకేం పని అంటూ దౌర్జన్యానికి దిగారు. వారు రికార్డు చేసిన దృశ్యాలు బయటకు రాకుండా మెమొరీ కార్డులు లాక్కున్నారు. పట్టపగలు సినిమాల్లోని వీధి గూండాలను తలపించారు. పోలీస్‌ స్టేషన్‌లోనే ఒక వ్య‌క్తి.. జర్నలిస్టుల్లో ఒకరిపై దాడికి యత్నించాడు. అయినా పోలీసులు చోద్యం చూసారని బిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసారు.

Read Also : CM Siddaramaiah : సీఎం సిద్ధరామయ్యపై మరో ఫిర్యాదు