ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం లో మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా “కిట్టీ పార్టీ ఆంటీ” (Kitty Party Aunty) లాగే వ్యవహరిస్తున్నాడంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ వద్ద ఆధారాలు లేక చీకట్లో చిట్‌చాట్‌లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం హోదాలో ఉండి ఇటువంటి చిల్లర మాటలతో వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపర్చడమేనని అన్నారు.
Pawan Kalyan: జనసేనాని కీలక నిర్ణయం.. కూటమిలో టీడీపీ ఆధిపత్యానికి చెక్?!
“జూబ్లీహిల్స్ ప్రాంతంలో మధ్యాహ్నం డబ్బున్న మహిళలు కిట్టీ పార్టీలు చేస్తారు, రేవంత్ కూడా అలాంటి వారిలాగే మాట్లాడుతున్నాడు. ఎవడు ఎక్కడో అన్న మాటల్ని నిజంగా నమ్మి, పది మందిని పోగేసుకుని చిట్ చాట్ పేరిట చిల్లర మాటలు మాట్లాడే స్థాయికి దిగజారాడన్నది ప్రజలకు స్పష్టమవుతోంది” అని విమర్శించారు. ఆధారాలు ఉంటే బయట పెట్టమని, లేదంటే చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ‘‘నువ్వే సీఎం, నువ్వే హోంమంత్రి అయితే దొంగల మాదిరి చీకట్లో కూర్చోకుండా నిజాలను బయటపెట్టు’’ అని సవాల్ చేశారు.
Rishabh Pant : రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధం..
దుబాయ్‌లో ఎవరో చనిపోతే దాన్ని తనపై మోపడం సిగ్గుచేటన్నారు. ‘‘శవాల మీద పేలాలు ఏరుకునే నీ స్థాయికి నీవు దిగజారావా?’’ అని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉండి ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని అన్నారు. ‘‘కిట్టీ పార్టీ ఆంటీలా చెవులు కొరికే మాటలు మాట్లాడి మీడియా మేనేజ్‌మెంట్ చేయాలనుకోవడం నీచతనం. ఆధారాలుంటే బయట పెట్టు, లేదంటే బురద జల్లే పనులు మానుకో’’ అని హెచ్చరించారు. రేవంత్ గతంలో తనపై చేసిన వ్యాఖ్యలపై కోర్టులో దాఖలు చేసిన కేసును గుర్తు చేసిన కేటీఆర్, కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్‌ను స్టే అని చెప్పే స్థాయికి ఆయన దిగజారాడని విమర్శించారు. ‘‘ఇంజెక్షన్ ఆర్డర్, స్టేలో తేడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి శాపంగా మారుతోంది. గౌరవంగా ఉండే పదవిని ఇలా అవమానించకూడదు’’ అని కేటీఆర్ హితవు పలికారు.