Site icon HashtagU Telugu

లోకేష్ తనకు తమ్ముడులాంటి వాడు – కేటీఆర్

KTR Tweet

KTR Election Campaign

బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి చంద్రబాబు (Chandrababu) , నారా లోకేష్ లపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండడం తో అన్ని పార్టీల నేతలు సభలు , సమావేశాలతోనే కాదు సోషల్ మీడియా లోను , పలు మీడియా చానెల్స్ లలో పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్..ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొని చంద్రబాబు , సీఎం జగన్ , పవన్ కళ్యాణ్ , లోకేష్ గురించి పలు కామెంట్స్ చేసారు.

ఇంటర్వ్యూ లో సదరు యాంకర్..చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిరసనలు వద్దని, ఏపీలో చేసుకోమని ఎందుకు మాట్లాడారు? అని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ సమాధానం చెబుతూ… ఆర్మూర్‌లో ప్రచారరథంపై నుంచి తాను పడటంతో తనకు స్వల్పంగా గాయాలయ్యాయని, ఆ సమయంలో నారా లోకేశ్ తనకు ఎలా ఉంది? అని మెసేజ్ పెట్టారని తెలిపారు. తాను బాగానే ఉన్నానని సమాధానం ఇచ్చానన్నారు. అదే సమయంలో చంద్రబాబుగారికి సర్జరీ అయింది కదా ఎలా ఉన్నారు? అని అడిగితే… బాగానే ఉన్నట్లు లోకేశ్ చెప్పారన్నారు. లోకేశ్ తనకు తమ్ముడిలా మిత్రుడని, పవన్ కల్యాణ్, జగన్‌లు కూడా అన్నల వలె తనకు మిత్రులు అన్నారు. తనకు ముగ్గురూ స్నేహితులేనని, వారందరితోనూ సత్సంబంధాలే ఉన్నాయన్నారు. వారితో తనకు ఎలాంటి రాజకీయ వైరం లేదని క్లారిటీ ఇచ్చారు.