Amrit Tenders : అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకల పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవబోతున్నారు. ఈ మేరకు కేటీఆర్ ఈరోజు ఢిల్లీకి వెళ్లన విషయం తెలిసిందే. అయితే తన ఢిల్లీ టూర్‌పై మంత్రులు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ‘అప్పుడే వణికితే ఎలా? ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టాను, హైదరాబాద్‌లో ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసింది’ అంటూ కేటీఆర్ నవ్వుతున్న ఎమోజీ పెడుతూ సెన్సేషనల్ ట్వీట్ చేశారు.
Just landed in Delhi, heard the tremors are being felt in Hyderabad already?!
అప్పుడే వణికితే ఎలా? 😁
— KTR (@KTRBRS) November 11, 2024
కాగా, అసలు కేటీఆర్ ఢిల్లీకి పోతున్నది తనను ఏసీబీ విచారించకుండా గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ఉండేలా డీల్ మాట్లాడుకోవడానికని పొంగులేటితో పాటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నాయి. అయితే తాను అమృత్ టెండర్లలో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వచ్చానని అంటున్నారు. కేటీఆర్ ఢిల్లీ ప్రయాణంపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తన ఢిల్లీ టూర్‌పై మంత్రులు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు.
ఇకపోతే..అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు చేయబోతున్నారు. రూ. 8888 కోట్ల విలువైన టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ టెండర్ల విషయంలో సృజన్ రెడ్డికి చెందిన షోద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ అపాయింట్ మెంట్ తీసుకుని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు.