Site icon HashtagU Telugu

KTR : రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా.. సర్కస్ నడుస్తుందా?: కేటీఆర్‌

ktr comments on congress government

ktr comments on congress government

Congress Government: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన,బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలు దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీద కోపంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. తిరిగి నేత కార్మికులకు చీరల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్లను మరో తిరుప్పూరు చేయడానికి కృషి చేశామన్న ఆయన, సిరిసిల్ల నేతన్నల తరఫున పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Read Also: Punjab Kings: ప్రపంచకప్ విన్నింగ్ కోచ్‌ను తొలగించిన పంజాబ్ కింగ్స్..!

ఈ సందర్భంగా సిరిసిల్ల అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు తలొగ్గి సిరిసిల్లలో ఇష్టానుసారం చేయొద్దు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా కూడా విచారణ చేస్తామని సూచించారు. ఇక ఇన్నోవేటివ్ థింకింగ్ అని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగా .? చేయని రుణమాఫీ చేసినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగా ? బామ్మర్దులకి కాంట్రాక్ట్‌లు ఇచ్చుకోవడం ఇన్నోవేటివ్ థింకింగా? అని ప్రశ్నలు గుప్పించారు.

హైడ్రా కూల్చి వేతలపై స్పందించిన కేటీఆర్‌..హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏం చేస్తుందో వారికే అర్థం కావట్లేదు. ప్రభుత్వం నడుస్తుందా… సర్కస్ నడుస్తుందా?హైడ్రా పేరుతో గర్భిణిలని ,పిల్లల్ని కూడా అవస్థలు పెడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఫార్మా సిటీ రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు చెప్పారు . ఫార్మాసిటీ ఉందా,రద్దు చేశారా లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం ప్రస్తుత సిటీ గురించి మాట్లాడటం లేదు.. ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Read Also: kadiyam srihari : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ : కడియం శ్రీహరి