తెలంగాణలో ఆర్టీసీ సిటీ బస్సు ఛార్జీలను (Bus Fare Hike ) ఒకేసారి రూ.10 పెంచడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా స్పందించారు. నిత్యం బస్సుల్లో ప్రయాణించే సాధారణ ప్రజలపై నెలకు కనీసం రూ.500 వరకు అదనపు భారం పడుతుందని విమర్శించారు. ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా జంట నగరాల ప్రజలను కక్షసాధింపు చర్యలతో ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు.
YCP : ఏపీని బీహార్ తో పోల్చిన వైసీపీ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని జంట నగరాల ప్రజలపై ఆగ్రహం తీర్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సక్రమమైన ఆర్థిక వ్యూహం లేకుండా అమలు చేయడం వల్ల RTC ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిందని, ఇప్పుడు ఆ భారాన్ని నేరుగా ప్రయాణికులపై మోపడం క్షమించరానిదని ఆయన పేర్కొన్నారు.
సాధారణ వర్గాల ప్రజలు, విద్యార్థులు, చిన్నతరహా ఉద్యోగులు RTC బస్సులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున ఈ పెంపు వారికి పెద్ద సమస్య అవుతుందని కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ప్రజా వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. BRS ప్రభుత్వం RTCని లాభాల్లోకి తీసుకువచ్చినట్లు గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ప్రయాణ సౌకర్యాన్ని రక్షించాలంటూ కేటీఆర్ హితవు పలికారు.
