భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. BRS తరఫున గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ఆయన “కర్రు కాల్చి వాత పెట్టాలి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇలాంటి వెన్నుపోటుదారులకి తగిన శిక్ష విధించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం పార్టీని పడగొట్టడమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని మోసం చేసిన చర్యగా ఆయన అభివర్ణించారు.
Samsung : టెలివిజన్ వ్యాపారంలో 10000 కోట్ల అమ్మకాలను అధిగమించి సామ్‌సంగ్
ఎవరు నిజమైన BRSవాళ్లు, ఎవరు ద్రోహులు అన్న విషయం ఇప్పుడు స్పష్టంగా బయటపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్, వారి మ్యానిఫెస్టోను “ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం”గా పేర్కొన్నారు. ప్రజలకు చేసిన హామీల్లో చాలవరకు అమలు జరగలేదని ఆరోపించారు. తెలంగాణలోని రైతులు, యువత, మహిళల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గద్వాల జిల్లాకు చెందిన BJP మరియు కాంగ్రెస్ నాయకులు BRS పార్టీలో చేరిన సందర్భంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. BRS త్వరలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోనుందని, జూన్ నెలలో సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. తన ప్రసంగంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిస్తూ, బహిష్కృత ఎమ్మెల్యేలను తగిన గుణ పాఠం చెప్పేందుకు ఉప ఎన్నికల్లో BRS సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.