Caste Census Resolution : కులగణనపై న్యాయ విచారణ కమిషన్‌ వేయాలని కేటీఆర్ డిమాండ్

అసెంబ్లీ తెలంగాణ ప్రభుత్వం (Congress Govt) కులగణన తీర్మానం (Caste Census Resolution) ప్రవేశపెట్టింది. మంత్రి పొన్నం (Ponnam ) తీర్మానం ప్రవేశపెట్టగా.. ఇచ్చిన హామీ మేరకు తీర్మానం ప్రవేశం పెట్టామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎమ్ఐఎమ్‌ నేతలు మద్దతు ఇచ్చారు. కాగా ప్రభుత్వం కులగణన, జనగణన, సర్వే చేస్తామంటోందని, అన్ని రకాల పదాలు వాడితే గందరగోళం ఏర్పడుతుందని BRS ఎమ్మెల్యే కడియం అన్నారు. ఇందులో […]

Published By: HashtagU Telugu Desk
Ktr Reacts On Bc Caste Cens

Ktr Reacts On Bc Caste Cens

అసెంబ్లీ తెలంగాణ ప్రభుత్వం (Congress Govt) కులగణన తీర్మానం (Caste Census Resolution) ప్రవేశపెట్టింది. మంత్రి పొన్నం (Ponnam ) తీర్మానం ప్రవేశపెట్టగా.. ఇచ్చిన హామీ మేరకు తీర్మానం ప్రవేశం పెట్టామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎమ్ఐఎమ్‌ నేతలు మద్దతు ఇచ్చారు. కాగా ప్రభుత్వం కులగణన, జనగణన, సర్వే చేస్తామంటోందని, అన్ని రకాల పదాలు వాడితే గందరగోళం ఏర్పడుతుందని BRS ఎమ్మెల్యే కడియం అన్నారు. ఇందులో ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. డోర్ టు డోర్ సర్వే చేసి వివరాలు సేకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రప్రభుత్వం బీసీ కులగణనపై తీర్మానం కాదు, చట్టం చేయాలని మాజీమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ కులగణనకు చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుందన్నారు. కులగణనపై న్యాయ విచారణ కమిషన్‌ అయినా వేయాలని డిమాండ్ చేశారు. బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలన్నారు కేంద్రంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ పెట్టాలని గతంలో డిమాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నుంచి ఓబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖపై రెండుసార్లు తీర్మానాలు చేసి పంపినట్లు తెలిపారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ పెట్టాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు గుర్తుచేశారు. కేంద్రంలో ఓబీసీ శాఖ పెడితే బీసీలకు రూ.2 లక్షల కోట్లయినా వస్తాయని కేటీఆర్ తెలిపారు.

అలాగే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..బీసీ కులగణన చేస్తే బీసీ కులాలే నష్టపోతాయని, న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం చేయాలని పేర్కొన్నారు. కులగణనను ఏ శాఖతో నిర్వహిస్తారు. ఏవిధంగా చేస్తారో ముందే స్పష్టం చేయాలని, కులగణన విధివిధానాలపై అఖిలపక్షంతో చర్చించాలని తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో చేసిన కులగణనకు న్యాయపరంగా చిక్కులు వచ్చాయని, మన వద్ద అటువంటి చిక్కులు రాకుండా చట్టం ఉండాలన్నారు. జనాభా ఆధారంగా చట్టసభల్లో 50 శాతం బీసీ ఎమ్మెల్యేలు ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Read Also : Ben Duckett Century : రాజ్ కోట్ లో భారత్ భారీస్కోరు..ధీటుగా జవాబిస్తున్న ఇంగ్లాండ్

  Last Updated: 16 Feb 2024, 06:04 PM IST