KTR : బీజేపీ పేరు మార్చిన కేటీఆర్‌.. కొత్త పేరు ఏంటంటే..?

మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్‌ కమిటీ భేటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విట్టర్‌ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - October 2, 2022 / 04:45 PM IST

మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్‌ కమిటీ భేటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విట్టర్‌ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 15లోపు వస్తుందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ పేర్కొన్న నేపథ్యంలో వ్యంగ్యాస్త్రంతో కూడిన ట్వీట్‌ చేశారు.

ఎలక్షన్‌ కమిషన్‌కు ముందే బీజేపీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) కంటే ముందగానే సోదాలు చేసేవారి పేరు చెబుతున్నారంటూ విమర్శించారు. ఎన్‌ఐఏ కంటే ముందే బ్యాన్‌ విధిస్తున్నారని, ఐటీ అధికారుల కంటే వేగంగా నగదు వివరాలు చెబుతున్నారని, సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు చెబుతున్నారన్నారు. భారతీయ జనా EC-CBI-NIA-IT-ED..Pగా పేరు మార్చుకోవాలంటూ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు. ఈ మేరకు ఓ పత్రికలో వచ్చిన వార్తను కేటీఆర్‌ ట్యాగ్‌ చేశారు.